అనాథాశ్రమానికి పాడి ఆవు

Updated By ManamWed, 07/11/2018 - 22:13
Indian-Bank

Indian-Bankహైదరాబాద్: ఇండియన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.కె. భట్టాచార్య ఇటీవల జంట నగరాల లోని ఇండియన్ బ్యాంక్ శాఖలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యూ నల్లకుంటలో జూలై 9 నూతన ప్రాంగణాన్ని ఆవిష్కరించారు.   కోఠిలో స్ట్రెస్‌డ్ అసెట్ మేనేజ్‌మెంట్ శాఖను కూడా అదే రోజు ప్రారంభించారు. తారా ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాథ శరణాలయాన్ని సందర్శించి అక్కడ చిన్నారులతో ముచ్చటించారు. వారికి పుస్తకాలు, ఇతర స్టేషనరి సామాగ్రిని అందజేశారు. ఆశ్రమ దైనందిన పాల అవసరాలు తీర్చేందుకు ఒక పాడి ఆవును కూడా ఇచ్చారు.  ఇండియన్ బ్యాంకు మైక్రోసేట్ శాఖ ద్వారా ఎస్‌హెచ్‌జీ రుణాల పంపిణీ కార్యక్రమంలో 520 మంది మహిళా లబ్ధిదార్లతో కూడిన 50 సంఘాలకు రూ. 5 కోట్లను మంజూరు చేశారు. నగరంలోని పలు శాఖల నుంచి రూ. 15 కోట్ల గృహ రుణాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ ఆర్. మనోహర్ పాల్గొన్నారు.

English Title
Dairy cow to the orphanage
Related News