అనంతలో సీపీఎం ఆందోళన.. ఉద్రిక్తత!

Updated By ManamTue, 06/12/2018 - 17:25
CPM leaders to agitation, farmers issues, Anatapur district

CPM leaders to agitation, farmers issues, Anatapur districtఅనంతపురం: అనంతపురం జిల్లాలోని రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది. 30 గంటల పాటు సీపీఎం చేపట్టిన దీక్ష పూర్తయ్యాక జిల్లా వ్యాప్తంగా సేకరించిన రైతుల అర్జీలను సమర్పిస్తామంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు సీపీఎం నేతలను అడ్డుకున్నారు. దాంతో సీపీఎం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో మహిళా పోలీసులు, సీపీఎం కార్యకర్తలకు స్వల్ప గాయాలవ్వగా, ఓ వాహనం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనలో పాల్గొన్న సీపీఎం నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. 

English Title
CPM leaders to agitation for farmers issues at Anatapur district




Related News