సంపత్, కోమటిరెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్

Updated By ManamTue, 06/12/2018 - 20:27
Court contempt petition, Sampath kumar, Komati reddy venkatareddy, High court, Telangana assembly speaker 

Court contempt petition, Sampath kumar, Komati reddy venkatareddy, High court, Telangana assembly speaker హైదరాబాద్‌: ఎమ్మెల్యేలుగా తమను కొనసాగించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై గతంలో కోమటిరెడ్డి, సంపత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ వారిద్దరినీ పదవీకాలం పూర్తయ్యే వరకూ యథాతథంగా ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల కార్యదర్శి ఇద్దరూ పరిగణించలేదు. ఎమ్మెల్యేలుగా కాకుండా, రావాల్సిన మర్యాద, జీతభత్యాలను కూడా తమకు ఇవ్వడంలేదంటూ వారిద్దరిపైనా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 

English Title
Court contempt petition to file Sampath kumar, Komati reddy venkatareddy in High court 
Related News