ఆ యాప్‌లతో సమాచారం చేరవేత!

Updated By ManamSun, 07/08/2018 - 23:49
image
  • స్క్రీన్‌షాట్ల రూపంలో తరలింపు

వాషింగ్టన్: స్మార్ట్‌ఫోన్‌లో ఎడాపెడా యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తున్నారా.. పేరొందిన కంపెనీ యాప్ అనే ధీమాతో ఇన్‌స్టాల్ చేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించం డి! కుప్పలు తెప్పలుగా ఉన్న యాప్‌లలో కొన్ని యాప్‌లు మీపై గూఢచర్యానికి పాల్పడుతున్నా యని తాజా పరిశోధనలో తేలింది. స్మార్ట్ ఫోన్ తెరపై మీరు టైప్ చేసే అక్షరాలతో సహా మొత్తం సమాచారం అంతా సేకరించి థర్డ్ పార్టీకి చేరవే స్తున్నాయట! కెమెరా సాయంతో ఫొటోలు.. వీడియోలు తీయడంతో పాటు స్క్రీన్‌షాట్ల రూపంలోనూ మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయట.


imageఇందుకుగానూ సదరు యాప్‌లకు ఎలాంటి అనుమతి లేదని.. ఆ మాటకొస్తే వాటి నిర్వాకం వినియోగదారుడికి తెలిసే అవకాశమే లేదని అమెరికా పరిశోధకుడు డేవిడ్ కోఫిన్స్ పేర్కొన్నారు. మొబైల్, నెట్ బ్యాంకింగ్ చేసే సమయాలలో, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపే క్రమంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను, పాస్‌వర్డ్‌లతో సహా ఇత రులకు చేరవేస్తున్నాయని చెప్పారు. ఊరూ పే రూ లేని యాప్‌ల సంగతి పక్కన పెడితే మం చి పేరున్న కంపెనీల యాప్‌లు కూడా ఇలా చేయడంపై డేవిడ్ విచారం వ్యక్తంచేశారు.

ఇదే విషయాన్ని ఆయా కంపెనీల దృష్టికి తీసుకెళితే.. సదరు యాప్‌లలోని బగ్‌లను గుర్తించి, వాటిని తొలగించేందుకే ఈ సమాచారాన్ని ఉపయో గిస్తామని సమర్థించుకుంటున్నాయని తెలిపారు. అయితే, ఈ లోపాన్ని గుర్తించి ఇతరులు ఎవరైనా సమాచారాన్ని దొంగిలిస్తే వినియోగదా రుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు మాత్రం వారి దగ్గర జవాబులేదు. వినియోగదారుడే అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన యాప్‌లకు దూరంగా ఉండాలని అంటున్నారు.

English Title
Convey information with those apps!
Related News