కొనసాగుతున్న కుల విద్వేషాలు 

Updated By ManamSat, 07/21/2018 - 02:11
image

‘నేను ఎప్పుడు పుట్టానో తెలియదు... కానీ వేల ఏళ్ల క్రితమే ఈ గడ్డ మీదనే హత్య చేయ బడ్డాను పునరపి మరణం, పునరపి జననం కర్మ సిద్ధాంతం నాకు తెలియదు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టుకొస్తున్నారు’.

imageదళితులపై అగ్రకులాల పెత్తనం ఈనాటిది కాదు. తరతరాలుగా దళితులపై ఆర్థిక దోపిడీతో పాటు సామాజిక దోపిడీ విచ్చలవిడిగా సాగింది. ఈ దోపిడీకి ఎదురు నిలబడి ప్రశ్నించిన ప్రతి సారి మారణకాండ చోటుచేసుకుంది. ఈ మార ణకాండను ఎదిరించి ఒక ఉద్యమం పుట్టింది. చుండూరు, కారంచేడు మృతవీరులను స్మరించ డమంటే తరతరాల దోపిడీని ప్రశ్నించిన గొం తులను స్మరించడమే. చుండూరు, కారంచేడు మృతవీరులను స్మరించడమంటే ఇప్పుడు అధి కారమే కూర్చున్న ‘హిందూ మతోన్మాదాన్ని’ ఎదిరించడమే.

కారంచేడు గుంటూరు జిల్లాల్లో ఒక వర్గం పెత్తనంలో ఉన్న గ్రామం. ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే అగ్రకులాల అహంకారానికి రాజ్యాంగ బద్ధత వచ్చిందనుకున్నారు. దళితులు మంచి నీరు తెచ్చుకునే చెరువులో బర్లకు పెట్టే కుడితి  నీళ్లు పోయడాన్ని ప్రశ్నించిన దళితులపై దాడి చేసి దాదాపు ఏడుగురిని హత్యచేశారు. తరువా త తనకళ్ల ముందే కొడుకుని చంపితే సాక్ష్యం చెప్పిన అలిసమ్మను కూడా చంపేశారు. చీరాల  హాస్పిటల్‌లో బాధితుల వాంగ్ములం వీడియో తీసిన పింగిళి దశరథ రామ్‌ను హత్య చేశారు.

చుండూరు ప్రకాశం జిల్లాలోని రెడ్డి భూస్వా ముల పెత్తనంలోని ఒక గ్రామం. గ్రామంలోని భూస్వాముల దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు దాదాపు ఎనిమిది మందిని అతి కిరాతకంగా 1991 ఆగస్టు 6న హత్యచేశారు. ఈ హత్యాకాండ కు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు న్నాయి. అలా చంపబడ్డ దళితుల శవాలను పోస్టుమార్టం చేసిన డాక్టర్ మీద జరిగిన హింస కు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా 2014లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తగిన సాక్షులు లేరని నిందితులను వదిలివేసింది. ఆం ధ్ర వలస పాలన నుంచి విముక్తి కోసం ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేసి, ప్రజలు ఎన్నో కష్టాలను ఓర్చి తెలంగాణ సాధించుకున్నారు. 

కారంచేడు, చుండూరు వంటి ఘటనలు దేశంలో మొదటివీ కావు, చివరివి కూడా కావు.  కారంచేడు, చుండూరులకు ముందు, ఆ తర్వాత దళితుల మీద అగ్రకులాలు ఎన్నో హత్యలు, అత్యాచారాలు చేశాయి. కోర్టులు అగ్రకులాలతో నిండి ఏళ్ల తరబడి కేసులు లాగి, చివరకు రెండు, మూడు సంవత్సరాలు శిక్షలతో సరిపెట్ట డం ఇలాంటి సంఘటనలో మళ్లీమళ్లీ జరగ డానికి దారి తీసింది. కోర్టులు మనకు న్యాయం చెయ్యవు అని బాధితులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిసారి గ్రామాల మీద ఆధిపత్య కులాల పట్టు సడల కుండా జాగ్రత్త పడ్డారు. కొన్నిసార్లు ఆధిపత్యా న్ని నిచ్చెనమెట్ల వ్యవస్థను దగ్గరుండి కాపాడు కుంటున్నారు. తమ వాళ్లను చంపిన వారిని అరె స్టు చేసి తమకు న్యాయం చేయాలని అడిగితే అగ్రకులాల దాడులను తలదన్నే లాఠీ చార్జీలు చేశారు పోలీసులు.

కేవలం తెలుగు రాష్ట్రాల పరిస్థితి కాదు. ఇది మొత్తం భారతదేశంలోని ప్రతి చోటా రోజూ దళితుల మీద దాడులు, అత్యాచారాలు జరుగు తూనే ఉన్నాయి. బిహార్‌లో భూమిహార్లు దళితుల మీద సాగించిన హత్యాకాండ చెప్పన లవి కానిది. ఉత్తరప్రదేశ్‌లో ఠాకూర్లు మహారాష్ట్ర లోని మరాఠాలు, హర్యానా, పంజాబ్‌లో అగ్రకు లాల జాట్ల కాఫ్ పంచాయతీలు, రాజస్థాన్‌లో భన్వరీదేవి ఉదంతం లాంటివి ఇంకా దేశం మొత్తం మీద విచ్చలవిడిగా జరుగుతున్న న్యా యస్థానాల దాకా రాగలవని కొన్ని, రాలేని మరెన్నో ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత వైునారిటీ, దళితులపై అత్యాచారాలు, హత్యాకాండలు, దౌర్యన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు మందలించినా, ప్రజలు తీవ్ర నిరసనలువ్యక్తంచేస్తున్నా సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలుపేట్రేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తం గా ఉన్న వైునారిటీలు, దళితులు ప్రాణాలు అర చేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోననే భ యాందోళనల్లో వారు నలిగిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కారంచేడు, చుండూరు ఘటనలు పు నరావృతమవుతూనే ఉంటాయని, ఎన్ని ఘటన లు జరిగినా ప్రభుత్వాలు నివ్ముకు నీరెత్తినట్లు మౌనం పాటిస్తూనే ఉంటాయనిస్పష్టమవుతోంది. 

 - పల్లపు శ్రీనివాస్ 
కోదాడ, 7799440705

English Title
Continuing caste hatreds
Related News