సామాజిక వర్గాల సీట్లపై కాంగ్రెస్ కసరత్తు

Updated By ManamTue, 10/23/2018 - 06:58
Bhatti Vikramarka
  • ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ

  • హాజరైన రాజనరసింహ, భట్టి, గీతారెడ్డి, సర్వే

battiహైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాలకు టికెట్ల కేటాయింపుపై ఎఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నేతలతో సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి డాక్టర్ జే గీతారెడ్డి,టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వు అయిన నియోజకవర్గాలలో ఏఏ కులాలకు టికెట్లు కేటాయించాలన్న దానిపై కసరత్తు జరిగింది. 19 నియోజకవర్గాలకు గానూ మాదిగ సామాజిక వర్గానికి 11 సీట్లు, మాలలకు 8 సీట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వర్గానికి మెజారిటీ సీట్లు కేటాయించాలని ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నిర్దేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా 12 ఎస్టీ సీట్లకు గానూ చెరి 6 సీట్లు చొప్పున లంబాడీ, ఆదివాసీలకు కేటాయించే అవకాశం ఉంది.

English Title
Congress work on social sectors seat
Related News