రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం

Updated By ManamFri, 09/21/2018 - 01:55
komatireddy
  • నల్లగొండ నుంచే కేసీఆర్ పతనం

  • మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ: రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రె స్సేనని నల్లగొండ నుండే కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటి కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ మాయ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. ప్రజా మేనిఫెస్టో తయారు చేయడమే తన లక్ష్యం అన్నారు.

imageఅదేవిధంగా మహాకూటమిలో గెలిచే స్థానాలన్నీ కాంగ్రెస్‌కే ఉంటాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే ఖచ్చితంగా విజయం సాధిస్తున్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీపై నమ్మకంతో మేనిఫెస్టో కమిటి వైస్ చైర్మన్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టో అనేది ఎన్నికలకు ఎంతో కీలకమైందని, మ్యానిఫెస్టోలో ఉన్న ఆంశాలు ప్రజలకు భరోసా ఇస్తామన్నారు. తనకు పదవులపై ఆశ లేదని, తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామ చేశానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే తన ముందున్న లక్ష్యమన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీలో నేర చరిత్ర కలిగిన వారికి ఎమ్మెల్యే టికెట్‌లను కేసీఆర్ ఇచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను కీలకపాత్ర పోషించనున్నానని తెలిపారు. అంతకు ముందు హైద్రాబాద్ రోడ్డు నుండి ఆయన నివాసం వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీల నుండి చేరిన వారిని ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, కౌన్సిలర్ ఎస్‌కె లతీఫ్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, సుభాష్, సమీ తదితరులు పాల్గొన్నారు.

English Title
Congress will get the power
Related News