థరూర్‌కు కాంగ్రెస్ వార్నింగ్...

Updated By ManamThu, 07/12/2018 - 16:27
Tharoor
  • ​​​​​థరూర్‌కు హైకమాండ్ హెచ్చరిక

  • బీజేపీ గెలిస్తే దేశం ‘హిందూ పాకిస్థాన్’

  • శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు


shashi tharoorన్యూఢిల్లీ: బహిరంగ వేదికలపై మాట్లాడేటపుడు సంయమనంతో వ్యవహరిస్తూ జాగ్రత్తగా మాట్లాడాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం శశిథరూర్‌ను హెచ్చరించింది. ఈమేరకు బుధవారం నాడు ఓ సమావేశంలో శశిథరూర్ మాట్లాడుతూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్థాన్‌గా మార్చేస్తోందుని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాగ్రత్తగా మాట్లాడాలంటూ థరూర్‌ను హెచ్చరించింది.

ఇక అధికార బీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో పాటు శశిథరూర్ క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టింది. వివాదానికి ఆజ్యం పోసిన శశిథరూర్ మాత్రం తన మాటలకు కట్టుబడి ఉన్నారు. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ బీజేపీ నేతలే చెప్పుకుంటుంటే తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ‘భారత దేశం- ప్రజాస్వామ్యం, లౌకికత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడా రు. ఈ సందర్భంగా భారత ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు 2019 ఎన్నికల సమయంలో ఎదురవుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలోనూ బీజేపీని ఈ స్థాయి మెజారిటీతో గెలిపిస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికత్వం మట్టిగొట్టుకుపోతాయని, భారత్ హిందూ పాకిస్థాన్‌గా మారిపోతుందని థరూర్ తీవ్ర స్వరంతో పేర్కొన్నారు.

దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చేసి, మైనారిటీలను సమానత్వానికి దూరం చేస్తారని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని ముక్కలు చేసి హిందుత్వ రాజ్యానికి అనుకూలంగా ఉండే కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారంలేపాయి. థరూర్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అసంబద్ధ ఆరోపణలు చేసిన థరూర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. థరూర్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్రా స్పందిస్తూ.. శశి థరూర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. వాస్తవానికి పాకిస్థాన్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణమనే విషయం దేశం మరిచిపోదని కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ ఏర్పాటు పుణ్యం కాంగ్రెస్‌దే.. ఇప్పటికీ ఆ పార్టీ భారత్‌ను అప్రతిష్టపాల్జేసుందుకే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

  • శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
English Title
Congress warning to Shashi Tharoor
Related News