రాముడు సైతం సీతను విడిచిపెట్టాడు

Updated By ManamFri, 08/10/2018 - 15:04
Husain

Husainన్యూఢిల్లీ: రామాయణంలో రాముడు సైతం అనుమానంతో సీతాదేవిని విడిచిపెట్టాడని కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దల్వాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ బిల్లను సభ ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధమౌతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సమాజం పురుషాధిక్యతతో కూడుకున్నదని, మొత్తం వ్యవస్థను మనం మార్చాల్సిన అవసరం ఉందని హుసేన్ పేర్కొన్నారు.

ఇస్లాంలోనే కాకుండా హిందూ, క్రిస్టియన్, సిక్కు మతాలు సైతం మహిళలకు వివక్షకు గురిచేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం మహిళల సంక్షేమపై మోదీ సర్కార్ ఎలాంటి ఆసక్తి లేదని, ముస్లిం మహిళలకు మరిన్ని హక్కులు కల్పిస్తూ సాధికారత ఇస్తామని హామీ ఇవ్వడం కేవలం కండతుడుపు చర్య అని వ్యాఖ్యానించారు.

English Title
Congress MP Husain Dalwai sensational comments on Ramayana
Related News