తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలు

Updated By ManamFri, 09/21/2018 - 05:59
harish
  • పార్టీ కోసం కష్టపడండి : హరీశ్ రావు

harish raoహైదరాబాద్: కొత్తగా పార్టీలో చేరిన వారికి సముచిత స్ధానం కల్పించడంతో పాటుగా ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత రమణరావు, ఆయన అనుచరులు గురువారం ఉదయం మంత్రి సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. మరో రెండు నెలలు పార్టీ కోసం గట్టిగా పని చేయండి, వచ్చే ఐదేళ్ల పాటు మీ కోసం మేమంతా కష్టపడతాం అని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడేది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్ధానాలను తెరాస గెలుచుకోబోతుం దన్నారు. ఈ సారి జహీరాబాద్ కూడా గెలుచు కుంటామని అన్నారు. సింగూరు ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేసి ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని హరీష్ తెలిపారు. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లతో నర్సాపూర్ నియోజక వర్గంలోని 70 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు.

పరువు హత్యలపై స్పందించిన మంత్రి
పరువు హత్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. నాగరికతతో పాటు నడుద్దామని పిలుపునిచ్చారు. కుల విద్వేషాలకు దూరంగా ఉండాలని కోరారు. కుల వివక్ష ఒక సామాజిక రుగ్మత అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. అదొక అనాగరిక పరంపర. నాగరిక సమాజంలో  అలాంటి వివక్షకు తావు లేదు. కులం పేరుతో  జరిగే హింస మానవతకి మచ్చ. పెళ్లి ద్వారా రెండు కులాలు కలుస్తు న్నాయంటే అదొక సామాజిక వేడుక కావాలి అని అన్నారు. అంతరాలను అంతం చేసే ఆ ముంద డుగును స్వాగతించాలి. పంతాలు, పట్టింపులకు పోయి బిడ్డల ఉసురు తీయకండి. ప్రాణాలు తీయడాన్ని మించిన పరువు తక్కువ పని మరొకటి లేదని గుర్తించండి అని అన్నారు.

English Title
Congress leaders joining TRS
Related News