తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

Updated By ManamFri, 09/14/2018 - 13:54
Congress forms screening committe for Telangana assembly elections

Congress forms screening committe for Telangana assembly electionsన్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణకు స్క్రీనింగ్ కమిటీకి భక్త చరణ్‌‌దాస్ ఛైర్మన్‌గా, సభ్యులుగా జ్యోతిమణి సెన్నిమలై, శర్మిష్ట ముఖర్జీని నియమిస్తూ రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ తెలంగాణలో  సీట్ల సర్థుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై  దృష్టి పెట్టనుంది.

రాహుల్‌తో ముగిసిన భేటీ
కాగా అంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... పొత్తుల విషయంలో రాహుల్ దిశానిర్ధేశం చేశారని తెలిపారు. పొత్తును తాము వ్యతిరేకించలేదని, అయితే తమ అభిప్రాయాలు తెలిపామన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలని రాహుల్ సూచించినట్లు తెలిపారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే మీడియాలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, ఏదైనా ఉంటే పార్టీ సభల్లోనే మాట్లాడాలని సూచన చేశారన్నారు.

అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 15 నిమిషాలు పాటు రాహుల్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. గ్రూప్‌లు వీడి ఒకరికొకరు సహకరించుకోవాలని రాహుల్ సూచించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

English Title
Congress forms screening committe for Telangana assembly elections
Related News