కాంగ్రెస్‌కు జేడీఎస్ షరతులు, ఆఫర్లు

Updated By ManamTue, 05/15/2018 - 16:33
Conditions Apply: JDS Offers and Conditions for Congress

బెంగళూరు: జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పిన కాంగ్రెస్‌కు.. దేవెగౌడ పలు ఆఫర్లిచ్చారు. పలు షరతులు విధించారు. ఉపముఖ్యమంత్రి సహా 20 మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీఎస్ చీఫ్ దేవెగౌడ సమ్మతి తెలిపారు. అయితే, విధిగా ప్రభుత్వంలో చేరాలని షరతు విధించారు. సీఎంగా కుమారస్వామి, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్‌లకు ఆఫర్ ఇచ్చారు. అంతేగాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఇరు పార్టీలు అంగీకారం తెలిపాయి. కాగా, మంత్రి పదవుల్లో లింగాయత్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా జేడీఎస్‌ను కాంగ్రెస్ కోరినట్టు తెలుస్తోంది. ఇక, ఇటు దేవెగౌడకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫోన్ చేశారు. కాంగ్రెస్‌ వైపే వెళ్లాలని కోరారు.

English Title
Conditions Apply: JDS Offers and Conditions for Congress
Related News