దళితుల అభ్యున్నతికి సమగ్ర చట్టాలు అవసరం

Updated By ManamMon, 06/11/2018 - 23:52
IMAGE

imageభారతదేశంలో కులహింస అనేది రోజువారీ సాంఘిక వాస్తవికత. ఈ కులాల హింస ఎక్కువగా అగ్రకులం, దళిత కులాల మధ్య జరుగుతోంది. అగ్రకులాల వారు కులం పేరు తో దళితులను నియంత్రించడానికి లేదా దోపిడీ చేయడానికి తరచూ హింసకు పాల్పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అగ్ర కులాల మధ్య కూడా గ్రామాన్ని నియంత్రించడానికి, భూమి, హోదా, అధికారాన్ని సేకరించేందుకు జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతంలో రెడ్లకు, కమ్మలకు జరిగిన ఫ్యాక్షన్ గొడవలు, రాజస్థాన్‌లో జాట్లకు, రాజపుత్రులకు మధ్య జరుగుతున్న ఆదిపత్య పోరులు ఇవన్ని కూడా పూర్తిగా సామా జిక ఆధిపత్య హోదా కోసం, రాజకీయ ఆధిపత్యం సంపాదిం చటం కోసం జరిగిన సంగటనలే అధికంగా ఉన్నాయి. కాని ఇవాళ దేశంలో దళితుల మీద జరుగుతున్న దాడులు అన్ని కూడా వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా అణిచివేసే దాడులే.

ఆంధ్రప్రదేశ్‌లో, కారంచేడు ఇది కమ్మ-మాదిగలు, చుండూరు రెడ్లు  - మాలలకు, లక్ష్మీంపీట్ కాపులు - మాలలకు మధ్య జరిగిన సంఘటనలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఘర్ష ణలు అన్ని కూడా చారిత్రాత్మక పరిస్థితులలో జరిగాయి. తర తరాలుగా దళితులు వారి దైనందిన పనులలో అగ్రకులాలతో జతచేయబడ్డారు. వారు రోజువారీ మనుగడ కోసం ఉన్నత కులాల కింద పనిచేసి జీవనం సాగించే వారు. కొన్ని సంవత్స రాలుగా విద్య, ఉపాధికి దూరమైన దళితులు నేడు తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని విద్య, స్వయం ఉపాధి, ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. వారు అగ్ర కులాల ఆధిపత్యాన్ని, నియంత్రణను తిరస్కరించి సమాజంలో వస్తున్న సామాజిక మార్పులను ఆయుధంగా చేసుకొని రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకొని సంవత్సరాలుగా అణిచివేయబడ్డ వారి హక్కులకై పోరాడగలుగుతున్నారు. 

ఒకసారి పూర్వాపరాలు పరిశీలించినట్లయితే స్వాతంత్య్రం రాక ముందు నుంచే షెడ్యూల్డ్ కులాల, తెగలకు వ్యతిరేకంగా అరాచకాలు జరిగాయి. భారతదేశ చట్టం 1919 పనిని సమీక్షిం చటానికి 1920లో బ్రిటీష్ ఇండియాలో పర్యటించిన ఒక కమి టీ, అంటరానివారికి వ్యతిరేకంగా చాలా అమానుష చర్యలు జరిగాయి, కానీ సాక్ష్యాలు ఇవ్వటానికి ఎవరు ముందుకు రా లేదు ఎందుకంటే ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు, దండింపబడలేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, 1928 మే 29 న బహిష్కృత హితకారిణి సభ తరఫున భారత శాసన పరీక్ష కమిషన్ (సైమన్ కమిషన్) కు సమర్పించిన పత్రాలలో దళితులకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని దుష్కార్యాలను ఉదహరించారు.

స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా దళితులు అల్లర్లకు గు రైన సందర్భాలు తరచుగా గుర్తించబడ్డాయి. ఉదాహరణకు, 1957లో తమిళనాడులో చదువుకున్న యువ దళిత నాయకు డు ఇమ్మాన్యూల్ సేకరాన్ అనే దళితుడు ఎస్సీలపై అంటరాని తనం, దాని ఆధారిత అంతరాయాలను తిరస్కరించిన ఫలి తంగా రామనాథపురం అల్లర్లు, 1968 తమిళనాడులోని కిలె న్మాన్ని 44 మంది దళితుల సజీవ దహనం, ఆంధ్రప్రదేశ్‌లో 1969లో కంచికచర్ల కోటేసు సజీవ దహనం, 1978లో ఆంధ్ర ప్రదేశ్‌లోని ఇంద్రావళిలో భూవివాదానికి సంబంధించి పోలీ సులు 10 మంది ఎస్టీలను హత్య చేశారు. ఈ సంఘ టనలు అన్ని అప్పటి జాతీయ నాయకత్వాన్ని కదిలించాయి. అందు వల్ల, దళిత ఎంపిల ఒత్తిడి కారణంగా భారత ప్రభుత్వం 1974 నుంచి ఎస్సీలకు, 1981 నుంచి ఎస్‌టీల విషయంలో హత్య, అత్యాచారం, విస్ఫోటనం, దుఃఖం కలిగించే హత్యలపై దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించింది.

అయినప్పటికి బెదరింపులు, భౌతిక దాడులు, అత్యాచా రాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు, బీహార్లో 1979లో బెల్కి వద్ద ఎస్సీల సామూహిక హత్యలు, ఉత్తరప్రదేశ్ లో 1980లో కఫాల్టా గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెం దిన వరుడు గుర్రపు స్వారీచేశాడన్న అక్కసుతో ఊచకోత కో యడం, బీహార్లో 1985లో సాహిగ్ బంజ్ జిల్లాలో తమ హ క్కుల కోసం పోరాడుతున్న 15 మంది ఆదివాసులపై పోలీసు ల కాల్పులు జరిపారు. ఇటువంటి అమానుష సంఘటనల అనంతరం దళిత ఎంపీలు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఈ సమస్య తీవ్రతను గుర్తించిన అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఆగస్టు 15, 1987న తన స్వా తంత్య్ర ప్రసంగంలో అత్యాచారాలను తనిఖీ చేయడానికి, అవ సరమైతే ఒక చట్టం ఆమోదించబడుతుందనిప్రకటించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దళితు లకు భూమి హక్కులు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయం, విద్య, ఉపాధి, ఇతర సేవలు, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలు ఇవన్ని కూడా వీరికి దూరం చేయబడ్డాయి. ఇవాళ దళితులు సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెరిగి వారి హక్కుల కోసం పోరాడగలుగుతున్నారు. ఈ పరిస్థితులు మింగుడు పడని అగ్రకుల ప్రజలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం దళితులపై బెదిరింపు లకు, దాడులకు తెగబడుతున్నారు. కులహింస సమాజంలో సామాజిక అశాంతి, కులాల మధ్య కోపాన్ని సృష్టించింది. ఈ ఘర్షణలలో ఎక్కువగా దళితులే బాధితులు. సమాజంలో కుల సంఘర్షణలు సంభవించిన ప్పుడు పున రావాస కార్యక్రమాలలో మాత్రమే ఇది ముగి స్తుంది. అయితే దీర్ఘకాలిక సాంఘిక పరివర్తనాలకు ఏ ప్రయ త్నాలు చేయడం లేదు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరు గుపరిచేందుకు వివిధ చర్యలు తీసుకున్నప్పటికీ, అవి దుర్భ లంగానే ఉన్నాయి. దళితులు ఈ కులహింసలో జరిగిన అనేక క్రూరమైన సంఘటనల్లో తమ జీవితాన్ని, ఆస్తిని కోల్పో తున్నారు. ఇందుకు ఉదాహరణ 2012లో లక్ష్మింపేట అగ్ర కులాల చేతిలో ఊచకోతకు బలైన దళితులు నేటికి దుర్భ రమైనా జీవితాన్ని గడుపుతున్నారు. నాటి ప్రభుత్వాలు ఇంటికి రెండుగొడ్లను ఉపాధిగా ఇచ్చి చేతులు దులిపి వేసుకుంటే, నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారిని పట్టించుక్కున్న దాఖలాలు లేవు. ఒక్క లక్షీంపేట మాత్రమే కాదు. ఇవాళ అగ్ర కులాల దురహంకారానికి బలైన గ్రామాలకు, ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించడమే తప్ప వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చింది లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చిన వాటిని నేరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. 

కారంచేడు, చుండూరు దళిత ఊచకోత సంఘటనలు జరిగి దశాబ్దాలు గడుస్తున్న అగ్రకుల దురహంకారం నేటికి అలానే కొనసాగుతుంది. ప్రభుత్వ, రాజకీయ అండదండలు చూసుకొని దళితులను శరీరకంగా, మానసికంగా హింసించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అగ్రకులాల వారికి ఎదురు తిరిగితే సామాజికంగా ఊరి నుంచి వెలివేయడంలాంటి సం ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఏడాది క్రితం గరగపర్రు దళితులు తమ ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్న అక్కసుతో గ్రామం లోని అగ్రకులాలు అన్ని ఒక్కటై దళితులను సామాజిక బహి ష్కరణకు గురిచేశారు. ఒక్క గరగ పర్రు ఏమిటి మంథని మ ధుకర్ ఘటన, అభంగపట్నం, అగిరిపల్లి, పెదగోట్టిపాడు, నాగులుప్పలపాడు ఇలా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సమస్యతో దళితులు అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. 

ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కార్యరూపం దాల్చలేదు. దళిత గిరిజనులకు అండగా ఉన్న వేధింపుల చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. వాదించే ప్రభుత్వాలు చట్టాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకోవాలే కాని చట్టాల ను నిర్వీర్యం చేసే పనులు చేయరాదు. ఇలా చేయడం వలన దళితుల మీద దాడులు రెట్టింపు అయ్యే విధంగా ప్రోత్సహించి నట్లు అవుతుంది. వాస్తవానికి అత్యాచార నిరోధక చట్టం పాక్షి కంగానైనా అమలుచేసిన సందర్భాలు కూడా లేవు. అలాంట ప్పుడు దుర్వినియోగం అవుతుంది అనడం ఒక కుట్రగా కనప డ్తుంది. కనుక, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని చట్టాలను బలహీన పరచే కుట్రలను ఆపి, దళితుల అభ్యున్నతి కోసం మరిన్ని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

- చిన్న దండు 
రీసెర్చ్ స్కాలర్, 
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. 

English Title
Comprehensive laws are needed for the development of Dalits
Related News