కొలిక్కి వస్తున్న సర్దుబాట్లు

Updated By ManamSat, 09/22/2018 - 02:49
party
  • కూటమిలో కుదరుతున్న సీట్ల ఒప్పందాలు

  • టీడీపీ, టీజేఎస్, సీపీఐ జాబితా సిద్ధం

  • నిర్ణయానికి రావాల్సింది కాంగ్రెస్ మాత్రమే

party logoహైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి. పొత్తులు, పోటీ స్థ్దానాలపై తమ ప్రతిపాదనలను తెలంగాణ కాంగ్రెస్‌కు అందిం చాయి. సర్వేల ఆధారంగా పార్టీ బలబలాలు అంచనా వేసి సీట్లు సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని నిర్ణయించారు. కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడేందుకు ఒక వేదికపై వచ్చాయి. కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్లాల్సిన వ్యుహాలపై తొలిదశ చర్చలు పూర్తి చేసుకున్నాయి. అందులో భాగంగా కూటమిలో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతను అప్పగించారు. అభ్యర్థుల బలబలాలపై సర్వే చేసేందుకు తాము పోటీ చేయదలుచుకున్న జాబితాను టీడీపీ, టీజేఎస్, సీపీఐ,  కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీకి 15,  సీపీఐ12, టీజేఎస్‌కు 25 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్టు తెలుస్తోంది. కోదండరాం ప్రాతినిథ్యం వహిస్తున్న టీజేఎస్ మాత్రం  ప్రత్యేక షరతులు పెట్టినట్టు సమాచారం. మహాకూటమిగా కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ప్రత్యేక కౌన్సిల్  ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని, దానికి కోదండరాంను చైర్మన్ చేయాలన్న షరతులు పెడుతున్నారు. మరోవైపు పొత్తులో ముఖ్యభూమిక పోషిస్తున్న టీడీపీ 30 స్థ్దానాలు కోరుతున్నట్టు సమాచారం.   కారంగెస్‌కు బలమైన అభ్యర్థ్దులు లేని సీట్లనే టీడీపీ కోరుతుంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాల అభ్యర్థ్దుల పేర్లను కాంగ్రెస్ పెద్దల ముందుంచారు. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ  సీనియర్లులందరికి దక్కేలా జాబితా సిద్దం సిద్దం చేశారు.

జాబితా...
దేవరక్రద- రావుల చంద్రశేఖర్‌రెడ్డి,  మక్తల్ - కొత్తకోట దయాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ -ఎర్ర చంద్రశేఖర్ , రాజేంద్రనగర్ - ఎం. భూపాల్‌రెడ్డి,  శేరిలింగంపల్లి - మండవ వెంకటేశ్వర రావు, మువ్వ సత్యనారాయణ, కూకట్‌పల్లి- శ్రీనివాస్‌రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ - ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, సికింద్రాబాద్ -కూన వెంకటేష్,  ఉప్పల్- వీరేందర్‌గౌడ్, ఖైరతాబాద్ - బి.ఎన్.రెడ్డి, కోరుట్ల - ఎల్.రమణ,  ఆలేరు- బి.శోభారాణి, కోదాడ- బొల్లం మల్లయ్యయాదవ్, మిర్యాలగూడ - శ్రీనివాస్, ఖమ్మం- నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య ఈ సీట్ల కోసం గట్టిగా పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది.  ఈ సీట్లలో కనీసం 15 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో  15సీట్లను గెలిచిన టీడీపీ ఈసారి ఖచ్చితంగా గెలిచే సీట్లనే తీసుకోవాలని అనుకుంటుంది. అందుకే 19 పేర్లతో జాబితాను కాంగ్రెస్‌కు అందించింది. ఇక సీపీఐ 12 స్దానాలు, టీజేఎస్ 25స్థానాల జాబితాను అందజేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఒకటి రెండురోజుల్లో సర్వే ఫలితాలు వచ్చిన అనంతరం తరువాత సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలకు కూర్చునే అవకాశం ఉంది.

Tags
English Title
Compliant adjustments
Related News