జొహ్రీపై గతంలోనే ఫిర్యాదు 

Updated By ManamWed, 10/17/2018 - 01:36
rahul-johri-bcci
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

  • వివరణకు సిద్ధపడుతున్న బీసీసీఐ సీఈఓ 

rahul-johri-bcciముంబై: తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ అజ్ఞాత మహిళ ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్‌తో ఇరుకున్న పడ్డ బీసీసీఐ సీఈఓ రాహుల్ జొహ్రీ గతంలోనూ ఇలాంటి ప నికి పాల్పడ్డట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోర్డుకు చెందిన మహిళ కూడా జొహ్రీపై గతంలో ఆరోపణలు చేసినట్టు ఆంగ్ల దిన పత్రిక టెలిగ్రాఫ్ పేర్కొంది. ఆ పత్రిక కథనం ప్రకారం ఈ ఏడాది ఆరంభంలోనే జొహ్రీ ప్రవర్తనపై బోర్డులో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటర్స్‌కు (సీఓఏ) ఫిర్యాదు చేసింది. జొహ్రీ వేధింపులు తాళలేక ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ విషయంపై సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ రెండుసార్లు సమీక్ష జరిపారు. తొలి సమావేశంలో రాయ్‌తో పాటు ఆ మహిళ, ఆమె భర్త పాల్గొన్నారు. రెండో సమావే శంలో జొహ్రీ, ఆ మహిళ, బోర్డులో పేరు గాంచిన సీనియర్ అధికారి పాల్గొన్నారు. తాను అప్పుడే ఆమెకు రాత పూర్వక క్షమాపణ అడిగానని జొహ్రీ అంటుంటే.. అది ఇంకా ధ్రువీకరణ కాలేదని పత్రిక చెబు తోంది. అయితే తాజా ఆ రోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జోహ్రీకి సీఓఏ లేఖ రాసిన నేపథ్యంలో వివరణను సిద్ధం చేసుకు నేందుకు సీఈఓ సెలవులపై వెళ్లినట్టు తెలుస్తోంది.

English Title
Complaint against Johri
Related News