ముస్లింలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

Updated By ManamFri, 08/10/2018 - 15:02
CM Chandrababu Tells Good News For Muslims

CM Chandrababu Tells Good News For Muslims

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులకు శుభవార్త చెప్పారు.! ఎన్నో రోజులుగా తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పడు ఇక అన్నీ అయిపోయాయ్.. మంత్రిగా ఆయన పేరు ప్రకటించడమే ఆలస్యమని కూడా వార్తలు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు లేదా కర్నూల్‌కు చెందిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్ఠానం యోచించింది. అయితే అప్పట్లో అవన్నీ సాధ్యం కాలేదు. 

తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఈ ముస్లింలకు మంత్రి పదవి అనే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నామని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో పేరు ప్రకటిస్తామన్నట్లుగా బాబు చెప్పుకొచ్చారు. వక్ఫ్ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు. వక్ఫ్ భూములను కాపాడుతాం.. అక్రమదారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం స్పష్టం చేశారు.

English Title
CM Chandrababu Tells Soon Good News For Muslims
Related News