గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి 

Updated By ManamThu, 07/12/2018 - 21:00
CM Chandrababu naidu, Gas leakage incident,  victim families

CM Chandrababu naidu, Gas leakage incident,  victim familiesఅమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ ఉక్కు పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో లీకైన గ్యాస్‌ను పీల్చిన ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనకు గల కారణాలపై అధికారులను వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మృతుల్లో మనోజ్‌, రంగనాథ్‌, వాసిం‌, గంగాధర, లింగయ్య, గురవయ్య ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం (హోం మంత్రి) ఎన్ చినరాజప్ప కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు. 

English Title
CM Chandrababu naidu condolences to victim families Gas leakage incident 
Related News