వర్గ-కుల పోరాట సిద్ధాంత కర్త

Updated By ManamWed, 05/16/2018 - 01:17
image

imageదేశంలో కులనిర్మూలనా పోరాటాల్ని చేయడానికి అంబేడ్కర్ రచనలే ఆధారమని, వాటిని సమగ్రంగా చదివి కులాల కుళ్లును బయటకు తీసి ఎర్రజెండా పార్టీలు చేసే వర్గ పెట్టుబడీ దారి పోరాటాలకు గుండెల్లో గుబులు పుట్టించి, ఓ విప్లవ ఎర్రజెండా పార్టీల్లారా! ఇండియాలో కేవలం వర్గ పోరాటం చేస్తే సరిపోదు, వర్గ-కుల ఉమ్మడి పోరాటాలు చేయాలని, ఆ పోరాటం అంబేడ్కరిజంతో తప్ప మరో సిద్ధాంతంతో భారతదేశంలో విప్లవం విజయవంతం కాదని తెలుగు రాష్ట్రాల ఎర్రజెండాలలో చర్చ లేవదీసిన విప్లవ వీరుడు ‘మారోజు వీరన్న’.
వీరన్న పేరే ఒక చరిత్ర, అగ్రకుల మనువాదుల గుండెల్లో దించిన పిడిబాకు అతడు. ఎగిసే కెరటం అతడు. దళిత బహుజనుల చీకటి గుడిసెల్లో వెలిగే దీపం అతడు. మట్టి మనుషుల మనోవేదనకు, దోపిడీ దారుల చేతుల్లో నలిగిపోతున్న శ్రామిక వర్గానికి అండగా నిలిచే వేయిగొంతుకల నినాదం అతడు. అసి ్తత్వం పోరాట ప్రతీక అతడు. కార్మిక, కర్షకుల చమట చుక్క ఆయన. ఆకలి కేకల విప్లవ జ్వాల ఆయన. బహుజన పోరుబాట ఆయన. బల్లెం మోత, విల్లంబుల పోరాటానికి వేగుచుక్క పండు వెన్నెల కాసినట్టు నవ్వే ‘చల్లని వెన్నెల కాంతి అతడు, ఉదయించే ఉద్యమ ‘తొలిపొద్దు’ అతడు, సిద్ధాంతాలను రగిలిం చే ‘బడభాగ్ని’ వీరన్న.

1967 నుంచి 1972 వరకు కార్విరాల కొత్తగూడెంలో చదువుకున్న వీరన్న. ఆటలు - పాటలు, ఉపన్యాసం, వ్యాసరచనలో చిన్నప్పటి నుంచే ప్రతిభ కనపరిచేవాడు. ఆ తర్వాత 1972- 1977 వరకు తుంగతూర్తి ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. హేతువాద దృక్పథం కలిగిన వీరన్న సోదరుడు మల్లయ్యతో కలిసి 14 సంవత్సరాల వయసులోనే ‘ఊరు తిరగబడింది’ నాటిక రాసి ప్రదర్శింప చేశాడు. 1977లో 10వ తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుైడెన వీరన్న ఇంటర్మీడియట్ సూర్యాపేటలో, డిగ్రీని ‘సైఫాబాద్’ సైన్స్ కాలేజీలో పూర్తి చేశాడు. కొత్తగూడెం గ్రామంలో ఎగిసిన ఒక విప్లవ కెరటం భాగ్యనగర నడిబొడ్డును తాకి చరిత్ర సృష్టిస్తుం దని ఆ కాలానికి తెలియదు. డిగ్రీ, లా ఉండగానే వీరన్నలో విప్లవబీజాలు నాటుకున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ నుంచి ప్రగతిశీల భా వాలున్న పీడీయస్‌యులో చేరి విద్యార్థి సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. మారొజు వీరన్న, పిడియస్‌యు వీరన్నగా మారాడు. అన్యాయాలను, అక్రమాలను, ప్రభుత్వ దమనినీతిని విద్యార్థి లోకానికి వివరించాడు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు నిర్వహించాడు. 1985 జూలై 17న కారంచేడు దళితులను ఊచకోత కోసి చంపినప్పుడు, అగ్రనాయకత్వంతో సంబంధం లేకుండా పిడీయస్‌యును దళిత మహాసభ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి, దొరలకు వ్యతిరేకం గా పోరాటం చేసిన వ్యక్తి - శక్తి - మారోజు వీరన్న.

1990లో మండల్ కమిషన్ వచ్చిన సందర్భంలో కొన్ని వి ద్యార్థి సంఘాలు రిజర్వేషన్‌లను వ్యతిరేకించాయి. కానీ వీరన్న అంబేడ్కర్ రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలని పూర్తి మద్దతిచ్చాడు. కారంచేడు - చండూరు దళితుల ఊచకోత, రామజన్మ భూమి పేరుతో ముస్లింలపై భారతదేశంలో జరుగుతున్న దాడుల వెనుక గల కుట్రలన్నింటికీ ‘కులం’ ప్రధాన కారణమని గమనించిన వీరన్న, అంబేద్కర్ రచనలను చదవడం ప్రారంభించాడు. విద్యార్థినాయకుడి నుంచిరాజన్న నడుపుతున్న జనశక్తిలో చేరి క్రియాశీల భూమిక పోషించా డు. ఆ పార్టీలో ఉన్న దళిత బహుజనులను ఏకంచేసే ప్రయత్నం చేశాడు. మనదేశంలో చాలా ప్రమాదకరైమెన ఆయుధం ‘కులం’ అని. అది రూపుమాపకుండా విప్లవాలు విజయువంతం కావని గ్రహించాడు. ‘దళిత బహుజన మహాసభ’ ఏర్పాటు చేసి దళితులు, ముస్లింలు, గిరిజనులు కలిసి ఐక్య ఉద్యమాలు చే యాలని పిలుపునిచ్చాడు. అంతక ముందే వీరన్న సొంత నిర్ణయాలను పార్టీ అధినాయకత్వం హెచ్చరించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేసింది.

ఆ కాలంలోనే అనగా 1990లో అరుణోదయ కళామండలికి చెందిన ‘చైతన్య’తో వివాహం జరిగింది. అగ్రకుల నాయకత్వాలు చేసే విప్లవ రాజకీయాల వల్ల వీరన్న వర్గ పోరాటం మాత్రమే కాదు, కులపోరాటాలు ముఖ్యమని భావించాడు. ఆ ఉద్దేశంతోనే కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని ఉద్యమించాడు. 1994లో దళిత ముస్లిం ప్రజాస్వామ్య కార్యాచరణ వేదికను ఏర్పాటు చేశాడు. దీనితో జనశక్తిలోని అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరన్నపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. 1995 మే 17న జనశక్తి, రాజన్నతో చర్చ జరపాలని వీరన్న భావించాడు. వర్గ పోరాటం తో పాటు, కులపోరాటం చేస్తేనే ఇండియాలో విప్లవం విజయవంతం అవుతుందని, రష్యా-చైనా దేశ పరిస్థితులు విప్లవం విజయవంతైమెన విధానాన్ని ఉదాహరణలతో వివరించాడు. అగ్రకుల నాయకులు వీరన్న వాదనను తోసిపుచ్చారు. దళిత - బహుజనులు వీరన్నను సమర్థించారు. ఆ సమర్థించిన వారే మే - 17 కావ్రేుడ్స్‌గా బయటికి వచ్చి కుల ఉద్యమాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ఎవరి కులం పేరుతో వారు పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కులంపేరుతో వస్తున్నాయి. కుల ప్రాతిపదికన విద్యార్థి సంఘాలు వస్తున్నాయి. ఆత్మగౌరవ నినాదంతో మేం ‘మాదిగలము’ అని గూటం అందుకొని, డప్పు - చెప్పుతో దండోరా వేయడంలో వీరన్న ప్రోత్సాహం, సహకారం ఎంతైనా ఉంది. ‘మా తండాలో మారాజ్యం’ అన్న నంగారా భేరీలకు వీరన్న అనే ధైర్యం ఉంది. చాకిరేవు దెబ్బ ‘గొల్లకుర్మ - డోల్ దెబ్బ’, ‘మోకు దెబ్బ’, ఎరుకలి కుర్రు’, ‘కన్నెరనాదం’, ‘తంబూరా మోత’, ‘గన్ను దెబ్బ’, ‘కుమ్మరి సల్ప దెబ్బ’, ‘ఆదివాసీ విల్లంబుల మోత’ అనే ఎన్నో కులవృత్తులతో ప్రారం భించిన అన్ని సంఘాలు ధర్నాలు - ర్యాలీలు వీరన్న సిద్ధాంత భూమికతో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఈ అస్థిత్వ ఉద్యమాలకు కర్త - కర్మ - క్రియ మారోజు వీరన్నే.

1996 మార్చి 6వ తేదీన భువనగిరలో ‘తెలంగాణ హక్కు ల వేదిక’ పేరుతో తెలంగాణ ఉద్యమ నినాదాలు హోరెత్తాయి. అదిచూసి ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైంది. అస్థిత్వం కోసం జాతులు చేసే పోరాటం న్యాయైమెందని, అది ఎప్పటి కైనా విజయం సాధించక మానదని నమ్మిన వీరన్న, ప్రజాసంఘాలు - రైతు కూలీ సంఘాలు - కుల సంఘాల ఐక్యపోరు నినాదంతో ‘తెలంగాణ మహాసభ’ పేరుతో ప్రత్యేక తెలంగాణ కోసం 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో పెద్ద ఎత్తున సభను నిర్వహించి పాలకుల గుండెలదిరేలా మలి తెలంగాణ ఉద్యమ శంఖారావం పూరించాడు. తర్వాత భారత్‌ను ఇండియా పేరుతో పిలవాలని, అవెురికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నట్టుగా ఇండియా సంయుక్త రాష్ట్రాలను కలిగి ఉందని, (సీపీయఎస్‌ఐ) ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీని స్థాపించి దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ పేరుతో విద్యార్థి పోరాటాలకు పిలుపునిచ్చాడు. చివరకు ఉద్యమాన్ని సాయుధంగా మార్చి వర్గ - కుల - ఉమ్మడి పోరాటాలు విజయవంతం చేసే క్రమంలో 1999 మే 16 తేదీన పోలీస్ బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరత్వం పొందాడు మారోజు. తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్‌కు నిజైమెన వారసుడు వీరన్నే అనడం సత్యదూరం కానే కాదు.

- మెంతబోయిన సైదులు
రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ.
(నేడు మారోజు వీరన్న వర్థంతి)

English Title
Class-caste combat theorist
Related News