ఢిల్లీలో ఘోరం.. చిన్నారిపై అత్యాచారం!

Updated By ManamFri, 08/10/2018 - 09:58
Class 2 Student Raped Allegedly By Electrician In Delhi Government School

rape on 2nd class student

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. నిర్భయలాంటి కఠిన చట్టాలు వచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలకు మాత్రం కళ్లెం పడట్లేదు. బిడ్డలను స్కూల్‌కు పంపాలంటే భయం.. తాను భయటికెళ్లాలన్నా తల్లికి భయం.. నిత్యం భయం గుప్పిట్లో జనాలు బతికేస్తున్నారు.! ఎక్కడ్నుంచి ఏ కామాంధుడొచ్చి కాటేస్తాడోనన్న భయంతో బిక్కిబిక్కి బతికేస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే పలు ఘోరాతి ఘోర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 

Class 2 Student Raped Allegedly By Electrician In Delhi Government School

తాజాగా.. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారం జరిగింది. రెండో తరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిషియన్ అత్యాచారయత్నం చేశాడు. స్కూల్లో తాగునీటి కోసం వాటర్ పంపు దగ్గరికి వెళ్లగా అక్కడికి వచ్చిన ఎలక్ట్రిషియన్ ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అప్రమత్తమైన ఆ బాలిక అక్కడ్నుంచి పరుగులు తీస్తూ ఇంటికొచ్చేసింది. పాఠశాలకు దగ్గర్లోని స్లమ్ ఏరియాలో బాలిక కుటుంబీకులు ఉంటున్నారు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో, స్కూల్ సిబ్బందికి తెలిపి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాగా గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇలాంటి కామాంధులకు కఠిన శిక్షలు విధించాలంటూ విద్యార్థి సంఘం నాయకులు, బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

English Title
Class 2 Student Raped Allegedly By Electrician In Delhi Government School
Related News