సినిమాటోగ్రఫీ టు ప్రొడక్షన్

Updated By ManamTue, 06/19/2018 - 06:58
Shirya,-Niharika-film

Shirya,-Niharika-film‘కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జ్ఞాన శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ వేడుకకి వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్, గొట్టిముక్కల పద్మారావ్, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. తొలి సన్నిశానికి వరుణ్ తేజ్ క్లాప్ కొట్టగా, క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రియా శరన్, నిహారిక కొణిదెల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞాన శేఖర్ ఈ చిత్రాన్ని రమేష్ కరుతూరితో కలిసి సంయుక్తంగా క్రియా ఫిలిం కార్పొరేషన్ మరియు కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

English Title
Cinematography to Production
Related News