విజేత కోసం చిరంజీవి

Updated By ManamWed, 06/13/2018 - 23:02
image

imageకళ్యాణ్‌దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రాకేశ్ శశి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న సినిమా ‘విజేత’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను జూన్ 24న నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ‘బాహుబలి’ చిత్రానికి ఛాయాగ్రహణాన్ని అందించిన కె.కె.సెంథిల్‌కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జులై మొదటి వారంలో ‘విజేత’ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, నిర్మాత: రజని కొర్రపాటి.

English Title
Chiranjeevi for the winner
Related News