రాజకీయాలకు మెగాస్టార్ గుడ్‌బై..?

Updated By ManamTue, 10/16/2018 - 11:10
Chiranjeevi

Chiranjeeviహైదరాబాద్: ‘ఖైదీ నంబర్.150’తో రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. అలాగే తెలంగాణలో సార్వత్రిక ఎణ్నికలు సమీపిస్తుండుగా.. పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఇటీవల రాహుల్ గాంధీ, చిరంజీవిని కోరారట. దానికి కూడా చిరంజీవి నుంచి ఎలాంటి స్పందన లేనట్లు సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నంటునందుకే రాహుల్‌కు, చిరంజీవి ఏ మాట చెప్పలేదని లోగుట్టు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రచారంకు వెళితే షూటింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందునే రాహుల్‌కు స్పందించలేదని కూడా కొందరు అంటున్నారు.

కాగా 2008లో ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. వైఎస్ మరణం తరువాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపిన చిరు.. ఇన్ని రోజులు ఆ పార్టీ నేతగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ తరఫున కేంద్ర సహాయ మంత్రిగానూ చేశారు. అయితే మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోవాలనుకున్న చిరు, రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకే నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే చిరంజీవి సోదరుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. జనసేనను స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో చిరంజీవితో పాటు మెగా కుటుంబమంతా ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చిరు మొత్తం రాజకీయాలకే గుడ్‌బై చెప్తున్నాడని వార్తలు రావడం విశేషం.

English Title
Chiranjeevi say good bye to politics
Related News