ఓటేసిన చిరంజీవి, ఎన్టీఆర్, శ్రీకాంత్

Chiranjeevi, NTR

ఎన్నికల రోజున పలువురు ప్రముఖులు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో ఓటును వేశారు. భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో వచ్చిన చిరంజీవి తన ఓటును వేశారు. రామ్ చరణ్ విదేశాల్లో ఉండటం వల్ల ఓటింగ్‌కు రాలేకపోయారని చిరంజీవి చెప్పారు. ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా తన ఓటును వేశారు. భార్య ప్రణతి, తల్లి షాలినితో వచ్చిన ఎన్టీఆర్ ఓటును వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ ప్రముఖులు శ్రీకాంత్, శేఖర్ కమ్ముల, పరచూరి గోపాలకృష్ణ, విజయశాంతి, బండ్ల గణేశ్ తదితరులు తమ కుటుంబసభ్యులతో వచ్చి ఓటును వేసి వెళ్లారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 10.46శాతం పోలింగ్ శాతం నమోదు అవ్వగా.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.

సంబంధిత వార్తలు