వ్యవస్థలో సమూల మార్పులు

Updated By ManamTue, 10/23/2018 - 03:37
changes in the system

imageఆంధ్రప్రదేశ్ పరి పాలనా వ్యవస్థలో స మూల మార్పులు తీసుకువస్తున్నారు. జ వాబుదారీ తనంతో పాటు ఎక్కడైనా త ప్పు జరిగితే వెంటనే సరిదిద్దే వ్యవస్థను రూపొందించారు. ప నులన్నీ పారదర్శకం గా జరగడానికి ఇది ఉపయోగపడుతోంది. అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానంతో ఇప్పటికే చాలా విభాగాలలో దీనిని ప్రవేశ పెట్టారు. అన్ని ప్రభుత్వ పథకాలకు దీనిని వర్తింప జేస్తున్నారు. ప్రజలే ముందు (1100) ద్వారా ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నారు.  రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అన్ని విభాగాలలో వాస్తవ పరిస్థితులను అందరికీ అం దుబాటులో ఉంచుతున్నారు.

ఈ క్రమంలో పనులు జరగడంలో జాప్యం, పథకాల అమలులో లోపాలు ఎక్కడ జరిగాయో తెలిసిపోతుంది. వెంటనే వాటిని సరి దిద్దే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలో పేపర్‌లెస్ పాలన కొనసాగుతోంది. ఫైళ్లను ఆన్‌లైన్‌లోనే ఆమోదిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రభుత్వ పరిపాలన అంతా 100 శాతం ఆన్‌లైన్‌లోనే జరిగే విధంగా చర్యలు చేపట్టారు. కావలసిన పత్రా లన్నీ సక్రమంగా ఉంటే పరిశ్రమలకు కూడా 21 రోజు ల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా  కావల సిన వందల ధ్రువపత్రాలు ‘మీసేవ’ ద్వారా ఆన్‌లైన్ లో అందుతున్నాయి. ప్రభుత్వంతో ప్రజలకు కావల సిన పనులన్నీ ఆన్‌లైన్‌లో సులభతరం చేశారు. పట్టా దార్ పాస్ పుస్తకాలు వంటివి కూడా గతంలో మాదిరి గా కాకుండా ఇప్పుడు చాలా సులభంగా అందుతు న్నాయి. దాంతో ప్రభుత్వంలో పనులు వేగంగా జరుగు తున్నాయన్న భావన ప్రజల్లో  నెలకొంది. వ్యవస్థలో సాంకేతిక మార్పులు తీసుకురావడంతో అధికార యం త్రాంగం పనితీరు మెరుగైంది.

ప్రజలకు కూడా వారిపై నమ్మకం పెరిగింది. అధికార యంత్రాంగం మరింత నిమగ్నమై, ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి శ్రద్ధతో పనిచేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్న భావన తో ఉంది. అనేక ప్రామాణికాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం వల్లనే అనేక విభాగాల్లో అత్యు త్తమ ఫలితాలు సాధించారు. అయినప్పటికీ కొంతమం ది అధికారుల అలసత్వం, బాధ్యరాహిత్యం కారణంగా కొన్ని పనులు జరగడంలో జాప్యం జరుగుతోంది. కాల క్రమంలో అటువంటి ఆలస్యాలకు కూడా తావు లేకుం డా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఒక విజన్‌తో అందరూ కసిగా పనిచేయడం వల్ల గ్రామీణ ఆంధ్ర ప్రదేశ్ ముఖచిత్రం మార్చి వేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. పచ్చదనం వెల్లివిరుస్తోంది. వీధిదీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలో రాష్ట్రం మొద టి స్థానంలో నిలిచింది. 

గడచిన నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో పంచా యతీ రాజ్ శాఖ అవార్డుల పంట పండించింది. ఆ శాఖకు 17 అవార్డులు వచ్చాయి. సమాచార, సాంకే తిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు 15,  గృహ నిర్మాణ శాఖకు 15, ఇంధన శాఖకు 10 అవార్డులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో 550కు పైగా పురస్కారాలు రాష్ట్రాన్ని వరించాయి. 2017-18లో కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ జాతీయస్థాయిలో సాధించిన ప్రగతికి ఇచ్చిన 10 సూచికలలో నాలుగు సూచికల్లో రాష్ర్టం మొదటి స్థానంలో నిలిచింది. మరో నాలుగు సూచిక లలో రెండవ స్థానంలో, ఇంకో రెండు సూచికల్లో నాలు గవ స్థానం సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.  అయితే అవార్డులతోనే సంతృప్తి చెందకుండా అధికార యంత్రాంగం దానిని స్ఫూర్తిగా తీసుకొని మరింత సామర్ధ్యంతో పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించా లన్న పట్టుదలతో ఉంది. దేశంలో ఎక్కడా లేని అభివ ద్ధి ఏపీలో జరుగుతోంది. ఈ త్రైమాసికంలో రాష్ట్రం 11.25 శాతం వృద్ధిరేటు సాధించింది. సరళతర వ్యా పార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రం నెంబర్ 1 స్థానం లో నిలిచింది. ప్రజలు మరింత సౌఖ్యంగా నివసించేం దుకు ప్రణాళిక రూపొందించి నాణ్యమైన మంచినీరు, ఆరోగ్య వంటి మెరుగైన  సదుపాయాలు కల్పించి వారి జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ అనే కొత్త అంశంతో ప్రభుత్వం ముందు కు వెళుతోంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం నిర్మాణ సమస్యలను ఎదుర్కొంటూ స్వయంకృషితో 4 ఏళ్లలో ఆదాయాలు పెంచుకుంటూ వెళుతోంది. దేశంలో రెం డంకెల వృద్ధి రేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో  రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది.  15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోం ది.

టెక్నాలజీని ఉపయోగించుకోవడంతోపాటు వ్యవస్థ లో వెంటనే స్పందించే దృక్పథం వంటి చర్యల వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ను సమర్ధంగా అమలు చేస్తుండటంతో ప్రజల్లో సంతృ ప్తి శాతం పెరుగుతోంది. టెక్నాలజీ సాయంతో రూ పొం దించిన ఈ వ్యవస్థ మరింత పటిష్టమైతే ముందు ముందు పట్టాదార్ పాస్ పుస్తకాలు, ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకునే బాధలు కూడా ప్రజలకు చాలా వరకు తగ్గుతాయి.

- శిరందాసు నాగార్జున 
సీనియర్ జర్నలిస్ట్, 9440222914

English Title
changes in the system
Related News