మైండ్‌సెట్ మారాలి

Updated By ManamSun, 10/21/2018 - 08:56
helth food

imageదిగజారుతున్న జీవనశైలులతో ఆరోగ్యాలు దిగజారుతుండటం ప్రస్తుతం భారతీయులు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య. అత్యుత్తమ హాస్పిటళ్లు, ఆరోగ్య నిపుణులు, సూపర్‌ఫుడ్స్, రోగ నిర్ధారణ ఉపకరణాలు, పోషకాహార నిపుణులు, జిమ్‌లు.. వంటివన్నీ ఉన్నప్పటికీ ఎటు చూసినా వ్యాధులు ఎందుకు కనిపిస్తున్నాయి? బహశా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొనే ప్రయుత్నంలో మనం ప్రాథమికాంశాలను విస్మరిస్తున్నాం. ప్రకృతి నుంచీ, సాంప్రదాయూల నుంచీ దూరం జరుగుతున్నాం. దీర్ఘకాల పరిష్కారం కోసం కాకుండా తక్షణ పరిష్కారం కోసం వెంపర్లాడుతున్నాం.

విటమిన్ లేదా సూక్ష్మ పోషకాల లోపాన్ని అంత ఈజీగా మనం గుర్తించం. తగిన పరిమాణంలో ఈ సూక్ష్మ పోషకాలు శరీరానికి అందకపోతే, దాని పరిణామాలు ఎక్కువగానే ఉంటాయి. సప్లిమెంట్ పరిష్కారం కాదు. ఎందుకంటే ఒక సప్లిమెంట్ ఒక లోపాన్ని మాత్రమే పూరిస్తుంది. అదే ఒక ఖనిజం కానీ, ఒక విటమిన్ కానీ, అనేక ప్రక్రియల్ని పూరిస్తుంటుంది.

విటమిన్ ‘డబ్ల్యు’
ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో డి3, బి12 విటమిన్ల లోపం సాధారణం. అలాగే మెగ్నీషియం లోపంతోనూ ఎక్కువimage మందే బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, కండరాల సలుపులు, పిక్క కండరాల నొప్పుల నుంచి మనల్ని బయటపడేసేది మెగ్నీషియమే. 300 రకాల జీవరసాయన చర్యలు, ప్రతిచర్యలను నియంత్రించడానికి మెగ్నీషియం అవసరం. విటమిన్ ‘డబ్ల్యు’.. అంటే నీటి గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. చాలా మంది రోగుల సమస్యకు పరిష్కారం తగినంత మంచినీటిని తీసుకోవడం. చాలా మంది మైగ్రేన్లు, ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతుంటారు. వాటన్నింటికీ ‘సెల్యులార్ హైడ్రేషన్’ అవసరం. అంటే వాళ్లు తాగే నీళ్లు కణాలకు చేరాలి. చాలామంది సరైన రీతిలో నీటిని తాగరు. అంటే శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి తగినట్లు నీటిని తాగడం కూడా ఒక కళే.

కార్బోహైడ్రేట్లతో ఊబకాయం
imageభారతీయులు కార్బోహైడ్రేట్లను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ అవి ఖర్చవడానికి తగినట్లు వారు శ్రమ చేయరు. ‘తినండి కానీ అతిగా తినకండి’ అనేదే మన నినాదం. పూర్వ కాలంలో, మనవాళ్లు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవాళ్లు. కారణం శక్తి వినియోగానికి తగినంత శారీరక శ్రమ వాళ్లకు ఉండేది. కదలకుండా ఒక్కచోట కూర్చొని పనిచేసే జీవనశైలిలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటే వ్యాధుల్నీ, ఊబకాయూన్నీ స్వాగతించినట్లే! నాలుక మీది రసాంకురాల్ని (టేస్ట్ బడ్స్‌ని) ప్రేరేపించడానికి షుగర్, సాల్ట్, ఎంఎస్‌జీ (మోనోసోడియమ్ గ్లూటమేట్) వంటి వాటిని రెడీమేడ్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా జోడిస్తుంటారు. పైగా అధికంగా శుద్ధిచేసిన నూనెలను పునర్వినియోగించడం పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. ఇవి ఎసిడిటీని కలిగిస్తారుు.

మన వంటకాలే శ్రేయస్కరం
మన శరీరం తెలివిగా డిజైన్ చేయబడింది. సరైన తీరులో ఆహారాన్ని తీసుకొనేటప్పుడు దాన్నెలా తనకు ఉపయోగపడేట్లు చేసుకోవాలో శరీరానికి బాగా తెలుసు. సరైన నిష్పత్తిలో దేన్ని ఎలా తినాలనే విషయూన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆహారం అనేది మన శరీర పోషణకు ఉద్దేశించినదే కాని, ఒత్తిడిని కలిగించడం కోసం కాదు. రెండో విషయం, మన స్థానిక వంటకాలనే సరైన మార్గంలో, సంప్రదాయ మార్గంలో తినాలి. ఇవాళ వేలంవెర్రిగా భారతీయులు తీసుకుంటున్న ఆహారం గత పదేళ్లుగా ఏ ఒక్కరికైనా మేలు చేసిందనే విషయాన్ని కానీ, దానివల్ల బరువు సమస్యలతో బాధపడకుండా ఉన్నారని కానీ చదివామా, చూశామా? ఇప్పటికీ బరువుతగ్గే ప్రణాళికల్ని ప్రపంచం వెంటాడుతూనే ఉంది. సోషల్ మీడియూలో ఎవరైనా తన వెరుుట్ లాస్ సక్సెస్ స్టోరీని పోస్ట్ చేశారంటే చాలు, వెంటనే వాళ్ల డైట్ ప్లాన్ తెలియజెయ్యమని గోలపెడతారు జనం. వాళ్లు ఒక విషయం తెలుసుకోవాలి. మనందరం ఒకే రకంగా ఉండం. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి ఒకరి డైట్ ప్లాన్ ఇంకొకరికి పనిచేస్తుందని చెప్పలేం. 

షార్ట్‌కట్ లేదు
తిండి విషయంలో భారతీయుల మైండ్‌సెట్ మారాలి. జీవనశైలిలో మార్పు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్లే భిన్నం. ఒకరికి పనిచేసేది, ఇంకొకరికి పనిచేయదు. చాలా సింపుల్ ఉదాహరణ.. ఒకే ఇంట్లో ఒకే తిండి తినేవాళ్లలో ఒకరు ఆరోగ్యంగానే ఉంటే, ఇంకొకరికి అనారోగ్యం కలుగుతుంటుంది. కారణం వారి అలవాట్లు. చక్కగా తినాలి, చురుగ్గా కదలాలి, సరిగ్గా నిద్రపోవాలి, గాఢంగా శ్వాసించాలి. అంతే! చక్కని ఆరోగ్యానికి షార్ట్‌కట్ అనేది లేదు.

English Title
Change the mindset
Related News