రేపు చెన్నై వెళ్లనున్న చంద్రబాబు

Updated By ManamThu, 11/08/2018 - 20:18
Chandrababu Naidu, AP CM, DMK, Stalin, Rahul Gandhi, Kumara Swami, Devgowda
  • డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్న ఏపీ సీఎం

  • బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చర్చ

Chandrababu Naidu, AP CM, DMK, Stalin, Rahul Gandhi, Kumara Swami, Devgowdaఅమరావతి: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మద్దతు కూడగట్టుకునే దిశగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.  బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై అన్ని పార్టీల మద్దతును చంద్రబాబు కూటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు (శుక్రవారం) ఆయన చెన్నై వెళ్లనున్నారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన ఏపీ సీఎం.. ఈ రోజు కర్ణాటక సీఎం  కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన సంగతి విదితమే. 

English Title
Chandrababu naidu will go to Chennai tomorrow
Related News