‘పెథాయ్’పై చంద్రబాబు టెలికాన్ఫిరెన్స్

Chandrababu naidu, teleconference, Pethai cyclone, Resue operations, effected areas

అమరావతి: ఏపీని వణికిస్తోన్న పెథాయ్ తుపానుపై ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రతి ఏటా ఏపీ రాష్ట్రానికి తుపానులు రావడం పరిపాటిగా ఆయన పేర్కొన్నారు. తుపాన్లను ఎదుర్కోవడంలోనే సవాళ్లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది ఇది మూడో తుపానుగా పేర్కొన్నారు. మొన్న తిత్లీ, నిన్న గజ, ఇప్పుడు పెథాయ్ తుపాను వస్తోందన్నారు. తిత్లీతో తొలి 2 రోజులు ఇబ్బంది పడ్డామని చెప్పారు. గతంలో లోపాలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తిత్లీలో కొబ్బరి చెట్లు కూలి తీవ్ర నష్టం జరిగిందన్నారు. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకూలి ఇబ్బందులు పడ్డామని చంద్రబాబు గుర్తు చేశారు.

ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని పలు సూచనలు చేశారు. విపత్తు నిర్వహణలో ముందస్తు అప్రమత్తతే కీలకమన్నారు. సకాలంలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలని చంద్రబాబు తెలిపారు. రహదారులకు పడ్డ గండ్లను వెంటనే పూడ్చాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు ఎన్ని కావాలి.. ఎక్కడ నుంచి తేవాలనేది ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ఆహార ప్యాకెట్లు అందజేయాలని సీఎం సూచించారు. నిత్యావసర వస్తువులు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. వరికోతలు, పంట నూర్పిళ్లు ముందే పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు రాత్రింబవళ్లు జరగాలని చంద్రబాబు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు