స్టాలిన్‌తో చంద్రబాబు కీలక భేటీ..

Updated By ManamFri, 11/09/2018 - 20:45
Chandrababu naidu, Stalin, DMK leder, BJP, Narendra modi

Chandrababu naidu, Stalin, DMK leder, BJP, Narendra modiచెన్నై: డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం ముగిసింది. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్‌తో చంద్రబాబు దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. స్టాలిన్‌తో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని గద్దె దించేందుకు కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కూటమి ఏర్పాటు విషయంలో తమతో కలిసి రావాలని స్టాలిన్‌ను కోరినట్టు చంద్రబాబు తెలిపారు. నల్లధనమంతా అధికారికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే నేతలందిరితో చర్చలు జరుపుతామని చెప్పారు. నోట్ల రద్దుతో బ్యాంకులపై నమ్మకం పోయిందని చంద్రబాబు తెలిపారు.  

రాష్ట్రాల హక్కులను మోదీ సర్కార్ కాల రాస్తోంది: స్టాలిన్ 
చంద్రబాబుతో భేటీ అనంతరం డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల హక్కులను ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాల రాస్తోందని విమర్శించారు. మతవాద బీజేపీని దించేందుకు చేతులు కలిపామన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, ఏపీ సీఎం ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కలవడం ఆహ్వానించే పరిణామంగా ఆయన పేర్కొన్నారు. 

English Title
Chandrababu naidu requests Stalin to form Alliane against to BJP
Related News