ఎవరికీ భయపడేది లేదు: చంద్రబాబు

Updated By ManamFri, 09/14/2018 - 17:33
chandrababu naidu reacts on  Non-bailable warrant
chandrababu naidu reacts on non bailable arrest warrant

కర్నూలు : బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంలో నాన్‌బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్దేశ్యంతో నిరసన తెలపడానికే మేము బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లాం. అయితే ఉమ్మడి సమైక్య రాష్ట్ర సరిహద్దులోనే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పని చేసినా ప్రజల కోసమే పని చేశానే తప్ప, ఎలాంటి తప్పు చేయలేదని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని చంద్రబాబు అన్నారు.

‘నేను ఎక్కడా ఎలాంటి నేరాలు, ఘోరాలు చేయలేదు. దేనికీ భయపడేది లేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు నోటీసులు, అరెస్టులు అంటున్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశా. తెలుగు జాతికి నష్టం వస్తుందని బాబ్లీ ప్రాజెక్ట్‌పై పోరాడాను. ప్రజా హితం కోసం, ప్రజల కోసం నిరంతరం పని చేస్తుంది. కేసు గురించి న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’అని ఆయన పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద జలసిరికి చంద్రబాబు నాయుడు శుక్రవారం హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. నాగావళి-వంశధార ప్రాజెక్టులను అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు.

English Title
chandrababu naidu reacts on non bailable arrest warrant
Related News