దేవెగౌడతో చంద్రబాబు సమావేశం

Updated By ManamThu, 11/08/2018 - 16:10
Chandrababu Naidu  Meet HD Deve Gowda, HD Kumaraswamy
Chandrababu Naidu  Meet HD Deve Gowda, HD Kumaraswamy

బెంగళూరు : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. బెంగళూరులోని పద్మనాభనగర్‌లో దేవెగౌడ నివాసంలో ఈ సమావేశం జరిగింది. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి.

అంతకు ముందు ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న చంద్రబాబుకు ... దేవెగౌడ ఆయన కుమారుడు కుమారస్వామి స్వయంగా తన నివాసం వద్ద  స్వాగతం పలికారు.  కాగా గతంలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా దేవెగౌడను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

English Title
Chandrababu Naidu Meet HD Deve Gowda, HD Kumaraswamy
Related News