నేడు శ్రీశైలానికి చంద్రబాబు.. పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamFri, 09/14/2018 - 08:54
Chandrababu Naidu

Chandrababu Naiduశ్రీశైలం: శ్రీశైలం జలాశయం వద్ద జరగనున్న జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు శ్రీశైలం వెళ్లనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం వరకు బాండ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నల్లమల్ల అడవుల్లో భారీగా పోలీసులు మోహరించారు.

ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి కాన్వాయ్‌లో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆనకట్ట వద్దకు చేరుకొని జలహారతి ఇవ్వనున్నారు. అక్కడి నుంచి సున్నిపెంటకు చేరుకొని భారీ బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

English Title
Chandrababu Naidu going to Srisailam
Related News