ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు

Chandrababu Naidu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడి ఏపీ భవన్‌తో వివిధ పార్టీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 3.30గంటలకు పార్లమెంట్ అనుబంధ భవనంలో బీజేపీయేతర పక్షాలతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశానికి సుమారు 14పార్టీల నేతలు హాజరు అవ్వనున్నారు. ఇక ఈ భేటీలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా.. భవిష్యత్ కార్యాచరణపై వీరందరూ చర్చించనున్నారు. అలాగే జాతీయ కూటమికి పెట్టాల్సిన పేరుపైనా చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం తన పార్టీ ఎంపీలతో సమావేశం అవ్వనున్న చంద్రబాబు.. రేపటి నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత వార్తలు