కియా ఛార్జింగ్ స్టేషన్‌ ప్రారంభించిన చంద్రబాబు

Kia Motors

అమరావతి: ప్రముఖ దక్షిణ కొరియా కార్ల సంస్థ కియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కియా కార్లు, ఛార్జింగ్ స్టేషన్‌ను అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ హితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పీల్చే గాలిలో నాణ్యత పెంచడానికి విద్యుత్ కార్లు ఎంతో దోహదపడతాయని.. రానున్న రోజుల్లో సౌరవిద్యుత్ యూనిట్ రూపాయిన్నరకే లభించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. 

కియా అడుగుపెట్టడంతో వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం పూర్తిగా మారిపోయిందని, ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారిందని పేర్కొన్నారు. ఇక ఈ కార్లలో ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసే వీలుందని చెప్పారు. ఇక ఈ సందర్బంగా మూడు రకాల కార్లను కియా సంస్థ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వగా.. అందులో కూర్చొని ప్రయాణం చేశారు ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు