చంద్రబాబు నమ్మక ద్రోహి

Updated By ManamWed, 07/11/2018 - 23:10
image
  • నన్ను చంపాలని ప్రయత్నించారు:  మోత్కుపల్లి   

imageతిరుపతి: నారా చంద్రబాబునాయుడు నమ్మకద్రోహి అని తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి వచ్చిన మోత్కుపల్లి బుధవారం అలిపిరి మెట్లమార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. అంతకముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హింసించి, చంపిన వ్యక్తి చంద్రబాబు అని మోత్కుపల్లి అన్నారు. టీడీపీపై విమర్శలు చేసిన తనను చంపాలని చూశారన్నారు. రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి చంద్రబాబు తనను నట్టేట ముంచారన్నారు.

ఒక్కో రాజ్య సభ సీటును చంద్రబాబు రూ.100 కోట్లుకు అమ్శేశారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో తాను ఎప్పడూ అవినీతికి పాల్పడలేదని, చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసులో రేవంత్‌తో కలిసి దొరికిపోయాడన్నారు. దళితుడిని కావడం వల్లే తనను పార్టీ నుంచి బహిష్కరించారని మోత్కుపల్లి వాపోయారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణించారన్నారు. చంద్రబాబును ఓడించేందుకు జనసేన, వైసీపీ, సీపీఐ, సీపీఎంతోపాటు దళిత సంఘాలన్నీ సంఘటితం కావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో చ్రందబాబు ఓడిపోవాలని, మోకాళ్ల నొప్పులు ఉన్నా సరే తిరుమలకు నడిచి వెళుతున్నానని మోత్కుపల్లి చెప్పారు.

English Title
Chandrababu is a cheater
Related News