చాంపియన్ బెల్జియం

Men's Hockey World Cup
  • ఫైనల్లో 3-2తో నెదర్లాండ్స్‌పై విజయం

  • పురుషుల హాకీ వరల్డ్‌కప్

భువనేశ్వర్: పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియం జట్టు షూటౌట్‌లో 3-2తో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. అంతకముందు జరిగిన థర్డ్‌ప్లేస్ పోరులో గోల్స్ వరద పారించిన ఆస్ట్రేలియా జట్టు మాదిరిగానే ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్, బెల్జియం జట్లు గోల్స్ వరద పారించటం ఖాయామని భావించారు హాకీ అభిమానులు. కానీ అనుకున్న దానికి భిన్నంగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలి క్వార్టర్ నుంచే ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి.  తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్ చేయడానికి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాయి. దీంతో తొలి క్వార్టర్‌లో ఒక గోల్ కూడా నమోదు కాలేదు. అనంతరం జరిగిన చివరి మూడు క్వార్టర్స్‌లో కూడా ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో ఇరుజట్ల మధ్య షూటౌట్ తప్పలేదు. ఈ షూటౌట్ విభాగంలో బెల్జియం ఆటగాళ్లు   అద్భుతమైన ప్రదర్శన చేశారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో 3-2తో హాకీ వరల్డ్‌కప్ చాంపియన్‌గా బెల్జియం అవతరించింది. రన్నరప్‌గా నెదర్లాండ్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌కు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు.

ఆస్ట్రేలియాకు కాంస్యం 
హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్‌కు ముందు థర్డ్ ప్లేస్ కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ జట్టే మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఏకంగా 8-1తో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఆసీస్ జట్టులో టామ్ హ్యాట్రిక్ గోల్స్ (9, 19, 34వ నిమిషం)లో గోవర్స్ బ్లాకీ (8వ నిమిషం), మిట్టన్ ట్రెంట్ (32వ నిమిషం), బ్రాండ్ టిమ్ (34వ నిమిషం), జెరెమీ (57వ నిమిషం)లో గోల్స్ నమోదు చేశారు. ఇంగ్లాండ్ జట్టులో బారీ (45వ నిమిషం)లో ఏకైక గోల్ చేశాడు.

సంబంధిత వార్తలు