చైతన్య ఛాలెంజ్.. ఓకే అన్న సమంత

Updated By ManamSat, 05/26/2018 - 22:59
samantha

image‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ పేరుతో కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్... హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్, విరాట్ కోహ్లీలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. వారు ఛాలెంజ్‌ను స్వీకరించి, కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా నాగచైతన్య తన భార్య సమంతకు ఈ ఛాలెంజ్ విసిరారు. దాన్ని స్వీకరించిన సమంత జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. అంతకుముందు అఖిల్ తన సోదరుడు నాగ చైతన్యకు ఛాలెంజ్ విసిరారు. దీన్ని స్వీకరించిన చైతన్య జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘నేను రోజూ చేసే వ్యాయామాలు.. సమంత, సుశాంత్, నిధి అగర్వాల్‌కు ఛాలెంజ్ విసురుతున్నా’ అని చైతన్య ట్వీట్ చేశారు. దీన్ని సమంత స్వీకరిస్తూ.. ‘పుల్‌అప్’ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘గత కొన్నేళ్లుగా జిమ్ ట్రైనర్ ‘పుల్ అప్’ చేయమని చెబుతున్నారు. కానీ నేను తలనొప్పి, ఈ రోజు పని ఎక్కువైంది, కడుపునొప్పి ఇలా   అనేక కారణాలు చెబుతూ తప్పించుకున్నా. చివరికి ‘పుల్ అప్’ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా ఉపాసన, శిల్పారెడ్డి, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు నేను ఛాలెంజ్ విసురుతున్నా’’ అని సమంత పోస్ట్ చేసింది.

English Title
Chaitanya challenge .. sunnamantha okay
Related News