ఎన్నికల పోలింగ్.. సీఈఓ రజత్ హెచ్చరికలు.. 

CEO Rajat kumar, poll center, consume liquor, polling booth

హైదరాబాద్: పోలింగ్ బూత్‌లోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రజత్‌ హెచ్చరించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రతిసారి పోలింగ్ శాతం 55 కంటే ఎక్కువ లేదన్నారు. ఏడున్నర లక్షల మంది మొదటి సారి ఓటు వేస్తున్నారని రజత్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా శుక్రవారం అన్ని సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ రజత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు