కరుణ కోసం కేంద్రం కీలక నిర్ణయం!

Updated By ManamWed, 08/08/2018 - 14:27
Central Govt Takes Key Decision For Karunanidhi

Central Govt Takes Key Decision For Karunanidhi

  • మెరీనా బీచ్ వద్ద ఆర్మీని దింపిన కేంద్రం

చెన్నై: కరుణను కడసారి చూసేందుకు అభిమానులు, డీఎంకే కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. ఒక్క తమిళనాడు నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చెన్నైకి వస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం.. కరుణ అంత్యక్రియలు జరిగే మెరీనా బీచ్‌ వద్ద ఆర్మీని రంగంలోకి దింపింది. ఇప్పుడిప్పుడే సైనిక వాహనాలు చెన్నైకు చేరుకుంటున్నాయి. కాగా.. ప్రధాని, కేంద్ర హోం మంత్రితో స్టాలిన్ మాట్లాడారని ఆయన విజ్ఞప్తి మేరకు కేంద్ర బలగాలను చెన్నైకి రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల స్థల వివాదంపై కేంద్రంలోని ఇద్దరు పెద్దలు జోక్యం చేసుకోవడంతోనే మద్రాస్ హైకోర్టు మెరీనా బీచ్‌లో జరపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. రాజాజీ హాల్ వద్ద అభిమానుల తాకిడి భారీగా ఉంది. దీంతో కొందరు కార్యకర్తలు గోడలపైగా.. గేట్లుపైగా దూకిలోనికి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. సుమారు 40మందికి పైగా డీఎంకే కార్యకర్తలకు గాయాలయ్యాయని సమాచారం.

English Title
Central Govt Takes Key Decision For Karunanidhi
Related News