ఆ ఉద్దేశం కేంద్రానికి లేదు: జీవీఎల్

Updated By ManamMon, 10/29/2018 - 14:07
Central govt, President rule, GVL, GVL Narasimha Rao, AP CM, Chandrababu Naidu, TDP, YSRCP, Ys Jagan mohan Reddy

Central govt, President rule, GVL, GVL Narasimha Rao, AP CM, Chandrababu Naidu, TDP, YSRCP, Ys Jagan mohan Reddyఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. సోమవారం జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. ఎలాగో ఆరు నెలల్లో ప్రజలే టీడీపీని ఇంటికి పంపుతారని ఎద్దేవా చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ కోరుతుంటే టీడీపీ మాత్రం వద్దనడం దారుణమన్నారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చంద్రబాబు అంటున్నారని, ఇన్వెస్టిగేషన్ వివరాలు సీఎం వద్ద ఉండటమేంటి? అని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై దాడి ఆయన్ను చంపాడానికే అని పోలీసులు రిపోర్ట్‌లో రాశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్‌పై దాడి వల్ల ఎవరికి లాభం అనేది విచారణ జరపాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. 

English Title
Center has no intention to put president rule, says GVL Narasimha Rao
Related News