‘సాక్ష్యం’కు సెన్సార్ ఇబ్బందులు

Updated By ManamSat, 07/21/2018 - 12:59
Saakshayam

Saakshaym బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికేట్‌ కోసం సభ్యుల ముందుకు చిత్రాన్ని తీసుకెళ్లింది చిత్ర యూనిట్. అయితే సెన్సార్ సభ్యులు మాత్రం సినిమాను సెన్సార్ ఇచ్చేందుకు నిరాకరించారట.

కథానుగుణంగా ఈ చిత్రంలో కొన్ని బ్రతికిఉన్న పక్షులు, జంతువులను వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులు(ఎన్‌ఓసీలు) తీసుకోలేదట. దీంతో సెన్సార్ చేసేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడు ఎన్‌ఓసీలు తీసుకురావడం కష్టంతో చాలా కష్టంతో కూడుకున్న పని. దీంతో ఈ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

English Title
Censor Board Is Refusing To Certify Saakshyam
Related News