ఐసీఐసీఐకి ‘సెబి’ నోటీసు

Updated By ManamSun, 05/27/2018 - 00:46
kochar

chandaన్యూఢిల్లీ: వీడియోకాన్ రుణ కేసులో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఓ చందా కొచ్చర్‌కు, బ్యాంక్‌కి మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబి’ నోటీసు జారీ చేసినట్లు దేశంలోని ఈ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ శుక్రవారంనాడు వెల్లడించింది. వీడియోకాన్ గ్రూప్‌తోను, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు వ్యాపార ప్రయోజనాలున్ననుపవర్‌తోను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఈ నోటీసు జారీ అయింది. ‘‘దానిపై సెబికి సముచిత సమాధానం ఇవ్వడం జరుగుతుంది’’ అని బ్యాంక్ శుక్రవారం స్టాక్ ఎక్చ్సేంజిలకు నివేదించిన పత్రంలో తెలిపింది. దీనితో గురువారం సెబి నుంచి నోటీసు అందిన సంగతి ధ్రువపడింది. వీడియోకాన్‌కి 2012లో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేసిన వ్యవహారం, అందులో దీపక్ కొచ్చర్ పాత్ర పోషించడానికి గల అవకాశంపై కేంద్ర నేర పరిశోధక సంస్థ (సి.బి.ఐ) ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.

ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్‌తో సహా కొన్ని బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణం పొందిన తర్వాత, దీపక్  కొచ్చర్ యాజమాన్యంలోని నుపవర్ రెన్యూవబుల్స్‌లో  వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ రూ. 64 కోట్లు ఇన్వెస్ట్ చేశారని ఆరోపణలున్నాయి. రుణ లావాదేవీలో తానెలాంటి తప్పుడు పని చేయులేదని ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ ఖండించింది. వీడియోకాన్‌కు రుణమిచ్చిన కన్సార్టియంలో తానూ ఒక భాగం మాత్రవేునని పేర్కొంది. చందా కొచ్చర్‌పై బ్యాంక్ డైరెక్టర్ల బోర్డునకు పూర్తి విశ్వాసం ఉందని, వీడియోకాన్ గ్రూప్‌కు రుణం విషయంలో కొందరు ఆరోపిస్తున్నట్లుగా ఇచ్చిపుచ్చుకున్నదేమీ లేదని ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ చైర్మన్ ఎం.కె. శర్మ గత నెలలో ప్రకటించారు. నుపవర్ రెన్యూవబుల్స్ ఇన్వెస్టర్లలో ఎవరూ ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ రుణగ్రస్తులు లేరని బ్యాంక్ అంతకుముందు వివరణ ఇచ్చింది. ‘‘ఒకప్పటి లిస్టింగ్ అగ్రిమెంట్ అండ్ సెక్యూరిటీస్, 2015 నాటి ఎక్చ్సేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్లు, డిజ్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్లు) నిబంధనల్లో  కొన్నింటిని పాటించలేదని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అంశాలపై సమాధానాన్ని కోరుతూ...సెబి పంపిన నోటీసు 2018 మే 24న మేనేజింగ్ డైరెక్టర్, సి.ఇ.ఓకి, బ్యాంక్‌నకు అందింది’’ అని బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజిలకు నివేదించింది. 

English Title
CBI notice to ICICI
Related News