సీవీసీ ఎదుట హాజరైన అలోక్ వర్మ

Updated By ManamFri, 11/09/2018 - 14:30
CBI director, Alok Verma, CVC, counters corruption, Asthana, Central Vigilance Commission, K V Chowdary

CBI director, Alok Verma, CVC, counters corruption, Asthana, Central Vigilance Commission, K V Chowdaryన్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణకు వర్మ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యాలయానికి వచ్చిన వర్మ.. గంటసాపు అక్కడే ఉన్నారు. ఈ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలపై అలోక్ వర్మ స్పందించలేదు. వర్మను విచారించేందుకు ఏర్పాటు చేసిన సీవీసీ కమిటీలో విజిలెన్స్ కమిషనర్లుగా టీఎం భాసిన్, శరద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అలోక్ వర్మ తన తరపు న్యాయవాది లేకుండానే గురువారం  సీవీసీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా వర్మ.. కేవీ చౌదరి, శరద్ కుమార్‌ను కలిసారు. కానీ విచారణ కమిటీ వర్మను విచారించకుండా శుక్రవారానికి వాయిదా వేసింది. 

విజిలెన్స్ కమిషనర్లలో ఒకరు అందుబాటులోకి లేకపోవడంతో వర్మను విచారించలేదు. గురువారమే సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానా కూడా సీవీసీను కలిశారు. వర్మపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలను అస్థానా సీవీసీకి అందజేసినట్టు సీవీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలు చేస్తూ అస్థానా సుప్రీంకోర్టులో వేసిన పిటిషిన్‌పై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని సీవీసీని ధర్మాసనం గత అక్టోబర్ 26న ఆదేశించింది. ఆదివారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో షెడ్యూల్ ప్రకారం సుప్రీం సోమవారం విచారించనుంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ డైరెక్టర్ ఒకరిపై ఒకరు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారిద్దరిని కేంద్రం సెలవుపై పంపించిన సంగతి విదితమే. 

English Title
CBI director Alok Verma appears before CVC, counters corruption charges levelled by Asthana
Related News