విక్రమ్ మూవీకి కాస్టింగ్ కాల్

Updated By ManamFri, 11/09/2018 - 14:29
Vikram
Mahavir Karna

ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ ‘మహవీర్ కర్ణ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం కాస్టింగ్ కాల్ ప్రకటనను ఇచ్చింది చిత్రయూనిట్. చిన్నప్పటి విక్రమ్ పాత్రలో నటించేందుకు 8నుంచి 16 వయసు ఉన్న వారు కావాలని వారు ఆ ప్రకటనలో వెల్లడించారు. చూడటానికి విక్రమ్‌లా ఉండి, మార్షియల్ ఆర్ట్స్ మీద పట్టు ఉన్న వారు [email protected]ి వారి వివరాలను పంపాలని చిత్రయూనిట్ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ చుట్టు పక్కన గానీ, మీ పిల్లలలో గానీ అలాంటి క్వాలిటీస్ ఉండే వెంటనే వివరాలను చిత్రయూనిట్‌కు మెయిల్ చేసి, విక్రమ్‌ పాత్రలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. 

English Title
Casting call for Vikram's movie
Related News