కుల అంతమే పంతం 

Updated By ManamFri, 10/05/2018 - 01:28
caste

imageభారతదేశంలోని అతిక్రూరమైన వ్యవస్థల్లో కులం ఒక టి. ఈ వ్యవస్థ వేల ఏండ్ల నుంచి ఇక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకు పోయింది. అన్ని వ్యవస్థ లను అది  తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నది. దీని మాయలో ధనికుడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదు వులేని వాడు ఇలా అందరూ సులువుగా పడిపోతూ రకరకాల సమస్యలకు కేంద్ర బిందువుల వుతున్నారు. కులం అనేది చేసే వృత్తి నుంచి ఏర్పడిం దని ఎప్ప ట్నుంచో చెబుతూ వస్తున్నారు. అంటే చేసేవృత్తే కులానికి గీటురాయని అర్థం కదా! అలాంటప్పుడు తమ వృత్తిని  జాగ్రత్తగా కాపాడుకుం టూ దానిలోనే కొనసాగాలను కుంటేనే కులం బల పడాలి. నేడు చాలా మంది తమ వృత్తులను వదిలిపె డుతూ తమ కన్నా ఉన్నత వృత్తులలోకి పోతున్నారు. అన్నప్పుడు కుల వ్యవస్థ బలహీనపడాలి కదా అలా ఎందుకు జరగట్లేదంటే వృత్తే కులానికి మూలమన్నది  అబద్ధం. కొంతమంది స్వార్థపరులు కావాలని సృష్టించినది గనక వృత్తితో కులానికి లంకె కుదరట్లేదు.

కుల వ్యవస్థ దినదినానికి బలపడుతున్నది. సాధా రణంగా ఎక్కువ శ్రమచేసే వారికి ఎక్కువ గౌరవం, ఎక్కువ సంపాదన రావాలి కాని ఇక్కడంతా వ్యతిరేకం. తక్కువ పని చేసేవాడు దర్జాగా జీవిస్తూ అన్ని వ్యవస్థ లను తన గుప్పిట్లో పెట్టుకుంటే, ఎక్కువ  పని చేసేవా డు రోజురోజుకు ఆర్థికంగా క్షీణిస్తూ తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి తీవ్రంగా ప్రయ త్నిస్తాడు. ఇక సామాజికంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. ఎక్కు వ శ్రమ చేసేవాడు ఎక్కువ వివక్షకు గురవుతూ ఉన్నాడు. నేటి సామాజిక, ఆర్థిక అసమాన తలు భవిష్యత్‌లో మరింతగా పెరిగే అవకాశాలున్నా యన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. రాజ్యం తన పాల న ద్వారా క్రమక్రమంగా కులరహిత సమాజానికి అడు గులు వేయాలని రాజ్యాంగంలో పొందుపర్చబడ్డది. కా వున దీనికి రాజకీయంగా పరిష్కారం లభించాల్సి ఉ న్నది కాని పాలకులకు అది చెవికెక్కడం లేదు. కారణం ‘కులరహిత సమాజం ఏర్పడటం కన్నా కులానికిన్ని తాయిలాలు ప్రకటించి వారిలో ఐక్యత రానీయకుండా తమ ఓటుబ్యాంకును కాపాడుకోవటమే తమకు రక్ష’ అని భావిస్తుండటం. అనగా కులవ్యవస్థ రాజకీయ నా యకులకు సులువుగా ఓట్లు వేయించుకోవడానికి తప్ప దేనికీ పనికి రావట్లేదనే సత్యాన్ని తప్పక గమనించాలి.

ఈ కల్పిత కుల వ్యవస్థలో యాదృచ్చికంగా తక్కు వ కులాల్లో పుట్టిన ఫూలే, అంబేడ్కర్‌లు కూడా కుల వ్యవస్థ చూపిన అమానవీయ బహిష్కారాలను  ఎదు ర్కొన్న వారే. అందరిలా ఆలోచించకుండా తమ వల్ల పరిస్థితిలో ఏం మార్పు తీసుకురాగలమో ఆలోచించి చక్కని పరిష్కార మార్గాలు చూపారు ఆ మహనీయు లు. ఒకరేమో మనకు పట్టిన దౌర్భాగ్యం పోవాలంటే సామాజాన్ని ఎదురించి విద్య అభ్యసించాలని ప్రోత్సహి స్తే, మరొకరేమో కుల వ్యవస్థ పునాదులు పెకిలించి వే యాలని సూచించారు. దీనికి కులాంతర, మతాంతర వివాహాలు  జరగాలని అభిలషించారు. వారి లక్ష్యం నేటికి నెరవేరలేదని చెప్పుకోవడానికి ఎలాంటి సంశ యం అవసరం లేదు. ఎందుకంటే కులం పేరుతో వివ క్షాదాడులు, హత్యలు, అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కులం ప్రధాన లక్షణం తమ కులం వారిని తప్ప మిగతా వారందరినీ మనుషులుగా చూడ లేకపోవటం. దేశ స్వేచ్ఛ, స్వాతంత్రాలను సాధించ టా నికి కృషిచేసిన వారిని సైతం, తమ కుల ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి వాడుకునే వారున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇంతటి భయం కర రక్కసిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు తమ తోటివారిని తమలాంటి వారే అని గుర్తిస్తే చాలు. ఒక కులంలో పుడితే ఉన్నతుడిగా, ఇంకో కులంలో పుడితే నీచుడిగా భావించే దుష్ట సంస్కృతి పోవాలి. మనిషిని మనిషిగా చూసే రోజు రావాలి. దీనికోసం కుల, మత గీతలు చెరిపేస్తూ అందరినీ సమానంగా గుర్తించే అస లైన మనిషితత్వం పుట్టుకు రావాలి. దీనికోసం కులం ఏర్పడినప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను స్ప ష్టంగా అర్థంచేసుకోవాలి. అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలి. కులానికతీతంగా పెళ్లిచేసుకున్న వారిపై తల్లిదండ్రులు దాడులు చేసిన ప్రతిసారి సమాజంలో చర్చ జోరందుకుంటూ ఉంటుంది.

కొందరు ఆ దాడు లను సమర్ధిస్తూనే తల్లిదండ్రులకు చెప్పి, ఒప్పించి చేసుకోవచ్చు కదా అనే వాదన చేస్తారు. కానీ అలా చె బితే తల్లిదండ్రులు ఒప్పుకుని పెళ్లిచేసే పరిస్థితులు ని జంగా ఉన్నాయా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. గూడు కట్టుకుని ఉన్న కులవ్యవస్థకు వ్యతిరేకంగా వారు తమ ను కలపడానికి ఇష్టపడరనే విషయం అర్థమై ప్రేమజం టలు ఒక్కటైతున్నాయి. ఏదైనా ప్రమాదానికి గురయిన వ్యక్తి, రక్తం అవసరమైనప్పుడు తనకు సరిపడే  గ్రూప్ ఉన్న వ్యక్తి రక్తాన్ని ఎక్కించుకోవడానికి మొగ్గు చూప ుతాడు కానీ కులం మీద అభిమానంతో తన కులం రక్తం దొరికేంతవరకు వేచిచూడడు. ఇలాంటి  అవస రం జీవితంలో  కొన్నివేల సార్లు ఎదురౌతుంది. ఎక్క డా అభ్యంతరం చెప్పనివాడు బిడ్డల కులాంతర వివా హంలో మాత్రం ససేమిరా ఒప్పుకోడు. పెళ్లిచేసుకున్న ప్పుడు భాగస్వామి ఏ కులం వారు కాదు చూడాల్సిం ది, వారిద్దరూ కలిసి సామాజిక ఆర్థిక సమస్యలను ఎ లా సమర్ధవంతంగా ఎదుర్కొంటారని చూడాలి. చిన్న ప్పటి నుంచే పిల్లలు స్వతంత్రంగా బతకగలిగే నైపుణ్యా లను అలవరచుకునేలా చేయాలి. వారితో నిత్యం మాట్లాడుతూ వారి అభిప్రాయాలను గౌరవించాలి. త మ అభిప్రాయాలను వారిమీద రుద్దకూడదు. ఎటు తిరి గి పిల్లలు పరిణితితో ఆలోచించేట్లుగా ప్రోత్సహిస్తే ఎటువంటి తప్పిదాలు చేయరు. తల్లిదండ్రులు తప్పక అలవర్చాల్సిన లక్షణం ఇది.

పరువు పేర అనాగరిక చర్యలకు  పూనుకునే వా రు తామున్నది ఆటవిక సమాజం కాదు నాగరిక సమాజం అన్న విషయం గుర్తుంచుకోవాలి.  వారి ప్రేమను అర్థం చేసుకుని వారి వైవాహిక జీవితం బాగుండటానికి సలహాలు ఇవ్వాలి. అసలేం నచ్చ కుంటే వారి మానాన వారిని వదిలేసి వా రి బతుకు వారిని బతకనివ్వాలి తప్ప రాక్షసులుగా సమాజంలో చీత్కరించుకునే పరిస్థితి కోరి తెచ్చుకోవద్దు.

- రవికుమార్ సంగనమోని
7893903740

English Title
The caste ends
Related News