సైఫ్ కుమార్తెపై దావా కేసు

Updated By ManamFri, 05/25/2018 - 14:44
sara, saif

Sara, Saifబాలీవుడ్ నటుడు సైప్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌పై దావా కేసు నమోదైంది. ‘కేదార్‌నాథ్’ సినిమా డేట్స్ విషయంలో గొడవలు రావడంతో ఆ మూవీ యూనిట్‌ ఆమెపై కేసును నమోదు వేసింది. ఈ కేసు విషయమై సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి సారా కోర్టుకు హాజరైనట్లు సమాచారం.

అయితే అభిషేక్ కపూర్ డైరక్ట్ చేస్తున్న ‘కేదార్‌నాథ్’ చిత్రం ద్వారా సారా బాలీవుడ్‌కు పరిచయం అవ్వాల్సి ఉంది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల ఈ మూవీ మధ్యలో ఆగిపోయింది. ఆ తరువాత ఆ డేట్లను రణ్‌వీర్ సింగ్ ‘సింబా’(టెంపర్ రీమేక్‌)కోసం కేటాయించింది. కానీ అనుకోకుండా ‘కేదార్‌నాథ్’ చేసేందుకు మరో నిర్మాతలు ముందుకు రావడంతో సారా అలీ ఖాన్‌ను షూటింగ్‌లో పాల్గొనాలని చిత్ర యూనిట్ కోరింది. అయితే ‘సింబా’ షూటింగ్ ముగిసిన తరువాతే అందులో సారా పాల్గొంటుందని ఆమె మేనేజర్ చెప్పినట్లు సామాచారం. దీంతో కేదార్‌నాథ్ యూనిట్ కోర్టుకు వెళ్లింది. దీన్ని బయటే పరిష్కరించాలని సైప్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలం అవ్వలేదని సమాచారం.

English Title
Case against Sara Ali Khan
Related News