మరో తూత్తుకుడి కాకూడదనేమో?

Updated By ManamThu, 10/04/2018 - 03:50
thuuthukudi

imageఅరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను సెప్టెంబర్ 23, ఆదివారం దుంబ్రిగూడా మండలం లివిటుపట్టు వద్ద మావోయిస్టులు కాల్చి చంపడంతో అంతవరకు సమాజం ప్రశాంతంగా వుం దని భావిస్తున్న నేతలు, అహింసావాదులూ, ప్రజా స్వామ్య వాదులుగా చెప్పుకొనేవారు ఒక్కసారిగా ఉలి క్కి పడ్డారు. అనునిత్యం ప్రభుత్వాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతో ఆధిపత్య మత, కుల, వర్గాల చేతుల్లో ఎంతోమంది దళితులూ, మైనారిటీలు, మహిళలూ హ త్యచేయబడుతున్నా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోష కాహార లేమితో పసిపిల్లలు నిత్యం వందల కొద్దీ చని పోతున్నా, కార్పొరేట్ల దురాశ వల్ల తాగేనీరు, పీల్చేగాలి కలుషితమయి ఆదివాసీలు, యితర పేదలు అనారో గ్యంతో అకాల మరణం చెందుతున్నా, అప్పుల బాధ తో రైతాంగం పాల్పడుతున్న ఆత్మహత్యలకు చలించని అహింసావాదులకు, మరో తూత్తుకూడి సంఘటన తమ కళ్ళముందు జరిగివుంటే, సంతాపం తెల్పే అవకాశం దక్కేది.  

ఈ వాతావరణంలో యిప్పుడే ఆర్థికంగా, సామా జికంగా కాదు, ‘ఎదుగుతున్న’ గిరిజన యువకుల్ని మావోయిస్టులు చంపడం ‘ఘాతుకం’గాక ఏమవు తుంది. పోలీసులు ఎన్‌కౌంటర్‌ల పేరుతో ప్రజల్ని కా ల్చిచంపినపుడు, మావోయిస్టుల సమస్య ‘రాజకీయ ఆర్థిక కోణం’లో చూడాలనే ఆలోచనలు రావు కాని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే, అవి వారికి రావడం, వాటినెటూ పాలకవర్గాలు ఖాతరు చే యవని తెలిసీ ఉచిత సలహాలివ్వడం షరా మామూలయింది. ఎదుగుతున్న గిరిజనులనే కాదు, ఎవరి ప్రాణాలైనా విలువైనవే. కానీ వర్గ సమాజంలో మెజారిటీ ప్రజల సంరక్షణ కోసం కొంతమందిని బలి చేయక తప్పదు. లేకపోతే తూత్తుకూడి ఉద్యమంలోలా శుభ్రమైన, కలుషితంగాని నీరు, గాలి కోసం సామా న్యులు బలవుతారని చరిత్ర చెబుతున్న వాస్తవం.
ఇక మావోయిస్టులు అంతమంది గిరిజన యువకులుండగా, యిప్పుడే ఎదుగుతున్న మాజీ ఎమ్మెల్యే,  ఎమ్మెల్యేలను ఎందుకు చంపారు? కేవలం వారి ఎదు గుదలను చూసి ఓర్వలేకేనా? పాలకవర్గాలు ప్రతి కు లం, మతంలోని కొందరు అవకాశవాదులను చేరదీసి వారి స్వప్రయోజనాలకు పెద్ద పీటవేస్తూ, వారిని బ్రోక ర్లగా మార్చుకొని ఆ మొత్తం సామాజిక వర్గాలకు మే లు చేస్తున్నట్టు నటిస్తూ తిరగబడకుండా ఆ సామాజిక వర్గాలకు కొన్ని రాయితీలు ప్రకటిస్తూ, వారి ఓట్లను కొల్లగొట్టడం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న పనే.  అంతేగాని, ప్రజలంతా స్వయం ఉపాధితో, తమ కాళ్ళ పై తాము నిలబడి స్వీయ గౌరవంతో బతికేలా విధానా ల అమలు చేయరు. అలా చేస్తే వాళ్ళకేం ప్రయోజనం? అభివృద్ధి పేరుతో ఆధిపత్య వర్గాలకు ఊడిగం చేస్తూ ప్రజల్ని నిర్వాసితులను చేసి, మరల వారికి కొంత స్వాంతన చేకూర్చే విధానాల అమలులో అన్ని పార్టీలు పోటీపడుతూనే ఉన్నాయి.

ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా గెలిచి, పాలక తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న వ్యక్తి. ఇందులో అతని ప్రత్యేకత ఏమీ లేదు. అవకాశమున్న ప్రతి రాజ కీయ నాయకుడూ చేస్తున్న పనే అది. రాజన్న పాలన లో, ఆ ప్రాంతంలో నదీ జలాలు కలుషితమయి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని బాక్సైట్ గనుల తవ్వ కాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన తెలుదేశం, తాను అధికారంలోకి రాగానే గనుల తవ్వకాలకు అస్మదీయలకు అనుమతినిచ్చింది. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గనుల లీజులతోనే సంతృప్తి చెందక అక్రమంగా స్థిరాస్తి సంపా ద మొదలెట్టాడు. పాడేరులో అక్రమ భవన నిర్మాణం, లీజు పూర్తయ్యాక కూడా ఆర్టీసీ స్థల ఆక్రమణ ద్వారా మరింత ఎదిగాడు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆదివా సీల నిరసన ధ్వనులు ఆయనకు సింహగర్జనలుగా విన్పించగా, పార్టీ మారాక అవి పిల్లికూతల్లా విన్పించ సాగాయి. గతంలో అన్ని మండలాల్లో గ్రామసభలు నిర్వహించి మైనింగ్ వ్యతిరేక పోరాటానికి ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఆ పోరాటాల్లో తాను ముందుంటా నన్న ఈ పెద్దమనిషి, తర్వాతి కాలంలో ఆ ఉద్యమా లను అణచివేయడానికి పోలీసులను ఉసిగొల్పడం, ఉద్యమకార్లపై కేసులు పెట్టడానికి పరోక్షంగానైనా ప్రో త్సహించాడు. గనుల తవ్వకాలవల్ల దాదాపు 21 నదు లు కలుషితమయి, ఈ మధ్యకాలంలో కలుషిత నీటి వల్ల అనారోగ్యంపాలై పదుల సంఖ్యలో ప్రజలు అకాల మరణం చెందారు. కేవలం అరకు ప్రాంత ప్రజలేగాక, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల ప్రజలూ అనారోగ్యా నికి గురవుతారని గిరిజనులను ఉద్యమాలకు ప్రోత్స హించిన ఈ పెద్దమనిషి, అధికార పార్టీ పంచన చేరా క మాజీ ఎమ్మెల్యే సామల సహకారంతో తనకు ఆ ప్రాంతంలో తిరుగుండదనే ధైర్యంతో ప్రజల జీవితాల్ని తన ఆర్థిక ఎదుగుదల కోసం పణంగా పెట్టాడు. 

తాను ప్రభుత్వ రక్షణలో వున్నానని, దాని మద్దతుతో ఏమైనా చేసుకోగలననీ, ప్రజలు తమ పోరా టాలను విరమించుకుంటారనీ, వారికి తానే దిక్కనే అతని ఆలోచనలకు మావోయిస్టు పార్టీ గండి కొట్టిం ది. ఈ సందర్భంలో, సందట్లో సడేమియా అంటూ కొందరు మేథావులనబడేవారు ఈ మావోయిస్టు ఎన్ కౌంటర్‌ను పౌరహక్కుల సంఘాలు ఎందుకు ఖండిం చరంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రజల హక్కులపై  ఎవరైనా దాడిచేస్తే, వారు మావోయిస్టులైనా ఎవరైనా, వారిని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు పోలీసు యంత్రాంగం ఉన్నాయి. రాజ్యాంగం పౌరహక్కుల సం ఘాలకు ఆ విధులనివ్వలేదు. కానీ, రాజ్యాంగాన్ని, చట్టాలను సక్రమంగా అమలుచేయాల్సిన వారే ఆ చట్టాలను ఉల్లంఘించినపుడు ప్రజల పక్షాన  రాజ్యాం గబద్ధంగా పోరాడే సంస్థలే పౌరహక్కుల సంఘాలు.
పాలకపక్ష విధానాలవల్ల తరతరాలుగా అనుని త్యం అనుభవిస్తున్న వ్యవస్థీకృత ప్రత్యక్ష పరోక్ష హిం సల మాటేమిటి అని, ప్రశ్నకు ప్రశ్ననే సమాధానమి వ్వాల్సి వుంటుంది. ఆ హింసకు కారకులైన వారు  శిక్షింపబడుతున్నారా? ఆ హింసల ముందు నేరుగా కనపడే ఈ హింస ఎంత? వీటినీ చర్చించాల్సిన అవ సరం ఇంకా వుందా?. అలాంటప్పుడు, రాజ్యాంగంపై ప్రమాణం చేసి పీటమేక్కిన వారే, రాజ్యంగా విలువ లను తుంగలో తొక్కి, ప్రశ్నించిన ప్రతివారిని నేరస్తులు గా శిక్షిస్తున్నపుడు, రాజ్యాంగంపై నమ్మకం లేదనే మావోయిస్టులను రాజ్యాంగ పరిధిలో వ్యవహరించ మనడం హాస్యాస్పదం. సర్వేశ్వరరావు, సోమల హత్య లు విషాదకరమే. వారివే కాదు ఎవరి అకాల మరణ మైనా విషాదమైనవే కాదనలేం. కానీ, వారి మరణా నికి దారితీసిన పరిస్థితులేమిటి, దానికి కారణమె వరు? 
తూత్తుకుడి సంఘటనలూ, దళితుల, ఆదివాసీల, మహిళల, మైనారిటీలపై వ్యవస్థీకృత హింసలను ఆపా ల్సిన బాధ్యత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ అధికార పీటమెక్కిన ప్రభుత్వాధినేతల, ప్రతిపక్ష నాయకులదే.

- అరుణ్, విరసం 

English Title
Can not be another thuuthukudi
Related News