సీసీఐ నిర్ణయంపై ‘కాయిట్’ విస్మయం

Updated By ManamThu, 08/09/2018 - 23:22
Walmart
  • వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్  ఇవ్వడంపై ఆందోళన

  • ఉద్యమానికి సన్నాహం

Flipkart-Walmartన్యూఢిల్లీ: వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) అనుమతించాలన్న నిర్ణయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కాయిట్) ‘అత్యంత దురదృష్టకరమైనది’గా అభివర్ణించింది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆ వర్తకుల సం ఘం ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ను స్వాధీనం చేసుకోవాలన్న అవెురికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతున్నట్లు సి.సి.ఐ బుధవారం వెల్లడించింది. సి.సి.ఐకి  ‘కాయిట్ ’ తన అభ్యంతరాలు తెలియజేసినా,  వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వకుండా సి.సి.ఐ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను కాలరాసేదిగా ఉందని  ‘కాయి ట్ ’ పేర్కొంది. ఈ అంశంపై పాలనా మండలి ఆగస్టు 19న నాగపూర్‌లో అత్యవసర సమావేశం జరుపుతుందని  ‘కాయిట్ ’ పేర్కొంది. పరిస్థితిని సమీక్షించి, దేశవ్యాప్త ఉద్యమానికి వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని, దేశంలో ఈ-కామర్స్ మార్కెట్‌ను నియం త్రించేందుకు, పరిశీలించేందుకు ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని  ‘కాయిట్ ’ కోరుతోంది. ఈ ఒప్పందం దేశంలో ఉన్న చట్టాలను, ప్రభుత్వ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని కన్నుగప్పి వ్యవహరించడమే అవుతుందని వర్తకుల సంఘం భయాందోళనలు వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాని 20.8 బిలియన్ డాలర్లకు స్వాధీనపరచుకుంటున్నట్లు వాల్‌మార్ట్ ఇన్‌కార్పొరేటెడ్ ఈ ఏడాది మే నెలలో ప్రకటించింది. ‘‘ముందుంచిన వాస్తవాలు పరిశీలించినప్పుడు...ప్రతిపాదిత సమ్మేళనం వల్ల భారతదేశంలో పోటీపై చెప్పుకోతగిన ప్రతికూల ప్రభావం ఏదీ ఉండకపోవచ్చనే కమిషన్ అభిప్రాయపడుతోంది’’ అని సి.సి.ఐ బుధవారంనాటి ఆదేశంలో పేర్కొంది. ‘‘ప్రతివాదులు బి2బి (బిజినెస్ టు బిజినెస్) అమ్మకాల్లో సన్నిహిత పోటీదారులు కారు. పోటీకి సంబంధించి ఆందోళన లేవనెత్తే విధంగా, వాటికి సమష్టి మార్కెట్ వాటా కూడా లేదు’’ అని సి.సి.ఐ పేర్కొంది. ఇండియాలో బి2బి అమ్మకాల్లో వాల్‌మార్ట్ మార్కెట్ వాటా అర శాతంకన్నా తక్కువగా ఉంది. ప్రతిపాదిత సమ్మేళనం వల్ల  రాగల మార్పులు గణనీయమైనవి కావు’’ అని సి.సి.ఐ దాని ఆదేశంలో పేర్కొంది. ప్రతిపాదిత విలీనం వల్ల సంబంధిత మార్కెట్‌లో ప్రధాన సంస్థలలో ఏదైనా వైదొలగవలసి వచ్చే పరిస్థితి కూడా ఏమీ లేదని వ్యా ఖ్యానించింది. కాగా, సి.సి.ఐ నిర్ణయంపై వాల్‌మార్ట్ హర్షం వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు వాల్‌మార్ట్‌కున్న నైపుణ్యం తోడవడం వల్ల దీర్ఘకాలిక విజయం సాధించగలిగిన, ఆర్థిక వృద్ధికి తోడ్పడగలిగిన స్థితిలో ఉంటామని వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

English Title
Cait' astonishment on the decision of the Cci
Related News