తొమ్మిదేళ్లుగా అక్క ఆచూకీ కోసం తమ్ముడి తపన.. చివరికిలా..

Updated By ManamFri, 08/10/2018 - 11:47
brother and sister

brother and sister

హైదరాబాద్: టైటిల్ చూడగానే ఇదేంటి సినిమా స్టోరీలాగా ఉందని ఆశ్చర్యపోతున్నారా! ఇది రీల్ ఘటన కాదు రియల్‌దే. వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు.. అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి 2006లో లింగమ్మ, హనుమంతు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు బంధువులే. అనంతరం హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా వీరంతా హాయిగా జీవితం గడిపేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే తల్లిదండ్రులకు, తమ్ముడికి కూడా ఒక్కసారి కూడా ఆ యువతి ఫోన్ చేయలేదు.

దీంతో అసలు ఆమెకు ఏమైంది..? ఏం జరిగింది అని గత తొమ్మిదేళ్లుగా అక్క ఆచూకీ కోసం తమ్ముడు ఉపేంద్ర హైదరాబాద్‌లో తిరగని చోటులేదు.. ఫిర్యాదు ఇవ్వని పోలీస్ స్టేషన్ లేదు. ఫేస్‌బుక్‌లో కూడా అక్కగురించి పోస్ట్‌లు పెట్టాడు. అలా తిరుగుతుండగా ఒకరోజు అక్కను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన వ్యక్తి (బావ) కంటపడ్డాడు. ఆయన పక్కనే మరో మహిళ ఉండటంతో మా అక్క ఎక్కడుంది..? ఏమైంది? అని అతడ్ని గట్టిగా అడగ్గా పొంతలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు పట్టించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇటీవల విచారించి విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

brother for sister

పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె ఇంట్లో నుంచి తీసుకొచ్చిన నగదు, నగలు లాక్కొని నాలుగేళ్ల తర్వాత హత్య చేసి మర్రిగూడ సమీపంలో ఉన్న బావిలో పడేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో పెళ్లి చేసుకునేందుకు తన ఇద్దరు పిల్లలు ఎక్కడ అడ్డొస్తారోనని వారిద్దర్నీ అమ్మేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ దుండగుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాధిత మహిళ తల్లిదండ్రులు పోలీసులు కోరుతున్నారు. ఇవాళ మృతదేహాన్ని పోలీసులు బయటికి తీస్తారని తెలిసింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Brother Searched Nearly 9 years For Sister Adress In Hyderabad
Related News