భ్రమరాంబకు బంగారు ఖడ్గం

Updated By ManamThu, 10/18/2018 - 04:53
golden-sword
  • శ్రీశైలం ఆలయంలో అమ్మవారికి కానుక

  • బరువు 400 గ్రాములు.. విలువ 15 లక్షలు.. కంకర రవీంద్రారెడ్డి దంపతుల సమర్పణ

golden-swordశ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ మహాశక్తి పీఠం కలసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబాదేవికి బంగారు ఖడ్గాన్ని సమర్పించారు.   హైదరాబాద్‌కు చెందిన కంకర రవీంద్రా రెడ్డి దంపతులు వజ్రాలను అమర్చిన బంగారు ఖడ్గాన్ని కానుకగా అందజేశారు. బుధవారం స్వామి అమ్మవార్లను దర్శించు కున్న తర్వాత ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచనం మంటపంలో ఈఓ శ్రీరామచంద్రమూర్తికి ఈ ఖడ్గాన్ని అందజేశారు. 400 గ్రాముల బరువుగల ఈ ఖడ్గం విలువ సుమారు రూ.15 లక్షల ఉంటుందని దాతలు తెలిపారు. సమర్పణకు ముందుగా ఖడ్గానికి సంప్రోక్షణ, పూజలను నిర్వహించారు. సమర్పణ అనంతరం దాతలను వేదశీర్వచనంతో సత్కరించి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

English Title
Brajamrabha is a golden sword
Related News