ఐసెట్‌లో అబ్బాయిల హవా

Updated By ManamThu, 06/14/2018 - 00:37
students
  • హైదరాబాదీకి ఫస్ట్ ర్యాంక్.. 164తో ముందున్న సత్య ఆదిత్య 

  • టాప్‌టెన్‌లో ఒకే ఒక్క అమ్మాయి.. మిగతా 9 ర్యాంకులూ అబ్బాయిలకే

  • 90.25 ఉత్తీర్ణత శాతం నమోదు.. 15 రోజుల్లో కౌన్సెలింగ్ 

studentsహైదరాబాద్: తెలంగాణ ఐసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను విడు దల చేశారు. టీఎస్‌ఐసెట్‌లో మొత్తం 90.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. ఈ సంవత్సరం ఈ పరీక్షకు 55,191 మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షకు హాజరవ్వ గా.. 49,812 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 15 రోజుల్లో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. టీఎస్ ఐసెట్‌కు పురుషులు 29139 మంది, మహిళలు 26051 మంది, ఒకట్రాన్స్‌జెండర్స్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో పురుషులు 26381(90.54 శాతం) మంది, 23430( 89.94 శాతం) మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ అర్హత సాధించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 14 రీజనల్ కేంద్రాల్లో 67 సెంటర్లలో 23, 24 తేదీల్లో టీఎస్‌ఐసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. వెబ్‌కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

టాప్‌టెన్ ర్యాంకర్స్ వీరే..
హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన సత్య ఆదిత్య తాటి 164.28882 మార్కులతో ప్రథమ ర్యాంకును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ డీడీ కాలనీకి చెందిన యల్చూరి సాయిసందీప్ 163 మార్కులతో రెండో ర్యాంకు, మేడ్చల్ జిల్లా గాంధీనగర్ చక్రిపురానికి చెందిన గాదె నవీన్‌కుమార్ 162 మార్కులతో మూడో ర్యాంకు, ఖమ్మం జిల్లా అర్బన్ ప్రాంతానికి చెందిన సీమకూర్తి లక్ష్మీసరస్వతి 161 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా జంగమగుంట్ల గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి పిదప 159 మార్కులతో ఐదో ర్యాంకు, మహారాష్ట్ర థానే వెస్ట్‌కు చెందిన రోహన్ జోషి 157 మార్కులతో ఆరో ర్యాంకు, జగిత్యాల జిల్లా కలానగర్‌కు చెందిన అలేటి ఫధ్వీతేజ 154 మార్కులతో ఏడో ర్యాంకు, ఎల్బీనగర్‌కు చెందిన గుబ్బ రంజిత్‌కుమార్ 153 మార్కులతో ఎనిమిదో ర్యాంకు, రంగారెడ్డి జిల్లా నాగోల్‌కు చెందిన డి.అవినాష్ 153 మార్కులతో తొమ్మిదో ర్యాంకు, రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన కౌత్వారపు వెంకటకౌషిక్ 152 మార్కులతో పదో ర్యాంకును సాధించారు.

జిల్లాల వారీగా ఫలితాల వివరాలు..
టీఎస్‌ఐసెట్‌ను మొత్తం 14 రీజనల్ కేంద్రాల్లో 67 సెంటర్లలో నిర్వహించారు. హైదరాబాద్ రీజనల్‌లోని ఐదు కేంద్రాల్లో 6797 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 6221 మంది ఉత్తీర్ణులయ్యారు. కరీంనగర్‌లో 4909 మందికి 4253 మంది, ఖమ్మంలో 2498 మందికి 2179, కోదాడ(నల్లగొండ జిల్లా)లో 1216 మంది పరీక్ష రాస్తే.. 1084 మంది, మహబూబ్‌నగర్‌లో 738 మందికి 655 మంది, మెదక్, నర్సాపూర్(సిద్ధిపేట జిల్లా)లో 931 మందికి 819 మంది, రంగారెడ్డిలో 28224 మందికి 25800 మంది, సంగారెడ్డిలో 2028 మందికి 1824 మంది, వరంగల్‌లో 5677 మంది పరీక్షకు హాజరైతే.. 4955 మంది, నిజామాబాద్‌లో 721 మందికి 646 మంది, కర్నూల్‌లో 565 మందికి 522, తిరుపతిలో 205 మందికి 198, విజయవాడలో 437 మందికి 422 మంది, విశాఖపట్నంలో 245 మందికి 234 మంది విద్యార్థులు టీఎస్‌ఐసెట్‌లో ఉత్తీర్ణులయ్యారు.

యూనివర్సిటీ రీజియన్ల వారీగా..
టీఎస్‌ఐసెట్ ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 51656 మంది పరీక్షకు హాజరైతే.. 46532 మంది క్వాలిఫై అయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 737 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే.. 694 మంది, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 789 మందికి 720 మంది, మిగతా యూనివర్సిటీల పరిధిలో 2009 మంది పరీక్ష రాస్తే.. 1866 మంది అర్హత సాధించారు.

ఫలితాల్లో అబ్బాయిలదే అధిక్యం..
టీఎస్ ఐసెట్ ఫలితాలు అబ్బాయిలు అధిక్యాన్ని ప్రదర్శించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 89.94 శాతం కాగా, అబ్బాయిలు 90.54 శాతం ఉత్తీర్ణతను కనబరిచారు. మొదటి 20 ర్యాంకుల్లో 17 ర్యాంకులు అబ్బాయిలవే కావడం గమనార్హం. ఇదిలావుంటే.. టాప్ టెన్ ర్యాంకుల్లో ఒకే ఒక్క మహిళ ర్యాంకును సాధించగా, మిగతా తొమ్మిది ర్యాంకులు పురుషులే దక్కించుకున్నారు. టాప్-20 ర్యాంకుల్లో చూస్తే.. కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు ర్యాంకులు సాధించడం గమనార్హం.

Tags
English Title
Boyfriends in iSet
Related News